Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap High Court Fired On Ttd Board Members

AP High Court : టీటీడీ బోర్డు మెంబర్లపై ఆగ్రహం..

Published Date :February 22, 2022 , 4:41 pm
By Gogikar Sai Krishna
AP High Court : టీటీడీ బోర్డు మెంబర్లపై ఆగ్రహం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీటీడీ బోర్డు మెంబర్లలో క్రిమినల్ కేసులు ఉన్నవారు, ప్రత్యేక ఆహ్వానితులు ఎక్కువ మంది ఉన్నారని వేసిన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే టీటీడీ బోర్డు మెంబర్లు 18 మందిలో ఇద్దరు మాత్రమే కౌంటర్ దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా దాఖలు చేయని వారిని కూడా కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయకుంటే విచారణ కొనసాగిస్తామని హై కోర్టు స్పష్టం చేసింది. ఆర్డినెన్స్ తెచ్చిన తరువాత జీవో ఇవ్వనందున ఆర్డినెన్స్ చెల్లదని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదించారు. దీంతో ఆర్డినెస్స్ పై ప్రత్యేకంగా పిటిషన్ వేయమని పిటిషనరుకు ధర్మాసనం సూచించింది.

జీవోపై హై కోర్టు ఇచ్చిన స్టే పై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్‌ వేయడంతో భూమనకు మాత్రమే ప్రత్యేక ఆహ్వానితునిగా వుండేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. భూమన కరుణాకరెడ్డి వేసిన ఇంప్లీడ్ పిటీషన్ విచారణకు అనుమతించద్దని పిటిషనర్ తరుపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అయితే భూమన స్వప్రయోజనం కోసమే ఇంప్లీడ్ పిటీషన్ వేశారన్న పిటీషనర్ తరుపు న్యాయవాది కోర్టు వివరించారు. ప్రభుత్వం మెమో కాపీ అందిన తరువాత కౌంటర్ దాఖలు చేస్తామని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. తాము కౌంటర్ వేసే వరకు స్టే వెకేట్ చేయవద్దని ధర్మాసనాన్ని పిటిషనర్ తరుపు న్యాయవాది కోరారు. మెమో కాపీ అడిగి తీసువాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ మార్చి 11కు వాయిదా వేసింది.

https://ntvtelugu.com/puvvada-ajay-about-bayyaram-steel-plant/

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP High Court
  • latest news
  • MLA Bhumana Karunakar Reddy
  • TTD board Members

తాజావార్తలు

  • Peddi: స్పెషల్ “హీరోయిన్” కోసం ఫలించని ప్రయత్నాలు.. మరింత ఆలస్యం!

  • SRH Powerplay Record: పవర్ ప్లేలో మరో రికార్డ్.. పంజాబ్ బౌలర్లను చితకొట్టిన SRH బ్యాటర్స్..!

  • Ranveer singh: ధురంధర్ సక్సెస్.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను కలిసిన రణవీర్ సింగ్..

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • Extramarital Affair: ట్యాక్సీ డ్రైవర్‌తో బ్యాంక్ మేనేజర్ భార్య ఎఫైర్.. భర్తను చంపేందుకు ప్లాన్! క్లైమాక్స్‌లో షాకింగ్ ట్విస్ట్..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions