NTV Telugu Site icon

వేస‌వి సెల‌వుల త‌ర్వాత ర‌ఘురామ కేసు విచార‌ణ‌

Raghu Rama HC

Raghu Rama HC

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు కేసు విచార‌ణ‌ను వేస‌వి సెల‌వుల త‌ర్వాత‌కు వాయిదా వేసింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు.. ఎంపీ రఘురామరాజును రమేష్ ఆసుపత్రి తరలింపు, అక్కడ వైద్య పరీక్షల నిర్వహణపై సీఐడీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాదులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జ‌రిగింది.. అయితే, సుప్రీంకోర్టు.. ర‌ఘురామ‌ను ఆస్ప‌త్రికి తరలింపు అంశంపై ఉత్తర్వులు ఈరోజే ఇచ్చిందని ఈ సంద‌ర్భంగా న్యాయమూర్తికి తెలిపారు ఏఏజీ.. అందుకే ఈ కేసును వేసవి సెలవుల తర్వాత విచారణ చేయాల‌ని కోరారు. దీంతో.. విచార‌ణ‌ను వేస‌వి సెల‌వుల త‌ర్వాత‌కు వాయిదా వేసింది హైకోర్టు. కాగా, ర‌ఘురామ కృష్ణంరాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆస్ప‌త్రికి త‌ర‌లించాల‌ని, అక్క‌డే వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని.. దానిని వీడియో తీయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.