కరోనా థర్డ్‌వేవ్.. అధికారులకు ఏపీ జీవోఎం కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.. మరోవైపు.. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. ఈ తరుణంలో కోవిడ్ పరిస్థితి, థర్డ్ వేవ్ సన్నద్ధత పై గ్రూప్ అఫ్ మిమిస్టర్స్ సమావేశం జరిగింది.. మంత్రి ఆళ్లనాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కన్నబాబు, అప్పలరాజు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. థర్డ్ వేవ్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఈ సందర్భంగా ఆదేశించింది జీవోఎం.. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్ ముందుగానే పరిశీలించి అవకాశం ఉన్న చోట పిల్లలకు చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
థర్డ్ వేవ్ లో అవసరమైన అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించిన జీవోఎం.. అర్హులైన తల్లులకు ఒక రోజు ముందుగానే వ్యాక్సిన్ టోకెన్స్ పంపిణికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.. ఇక, బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన వారికి అన్ని హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని.. ఇంజక్షన్స్ బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు జరిగితే కఠినంగా వ్యవహారించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినా అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రులు.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు.. చిన్న పిల్లలకు వైద్యం అందించడానికి అదనంగా వైద్యులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని.. ఆస్పత్రుల్లో బెడ్లు అందుబాటులో ఉంచాలని జీవోఎం పేర్కొంది.
Also Read
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
- AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
తాజావార్తలు
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
-
Story Board: కొంటే ట్యాక్స్ తింటే ట్యాక్స్ ..వసూళ్లతో జనానికి చుక్కలు..ప్రభుత్వ ఖజానాకు డబ్బులు
-
Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!