ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు.. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.. ఇక, మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో సంతాప దినాలుగా పాటించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. మరోవైపు, ఉమ్మడి ఏపీలో సీఎంగా, ఆర్థికమంత్రిగా, వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన రోశయ్య సేవలను స్మరించుకుంటూ.. మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. డిసెంబర్ 4, 5, 6 తేదీలను సంతాప దినాలుగా ప్రకటించింది.. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం కారణంగా ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు డిసెంబర్ 4 నుంచి 6వరకూ ఆంధ్రదదేశ్ ప్రభుత్వం సంతాప దినాలుగా పాటిస్తుందని ఓ ప్రకటన విడుదల చేశారు.
3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
