Republic Day 2023: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటోంది.. మరో రెండు నెలల్లో విశాఖ కేంద్రంగా పాలన సాగిస్తామని మంత్రులు చెబుతున్నారు.. అయితి.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఉపన్యాసంలో మూడు రాజధానులు ప్రస్తావనే లేకుండా ప ఓయింది.. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.. గవర్నర్ ఉపన్యాసంలో మూడు రాజధానుల ప్రస్తావన లేదు.. జిల్లాల విభజన అంశం వివరణకే పరిమితం అయ్యారు.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు.. ప్రధాన డ్యామ్‌లో 78.64 శాతం, ఆర్ అండ్ ఆర్ లో 22.11 శాతం పనులు పూర్తి అయినట్లు గవర్నర్ ఉపన్యాసంలో స్పష్టం చేశారు..
Read Also: Gutha Sukender Reddy: బాధ్యతల్లో ఉన్నవాళ్లే.. తెలంగాణ అభివృద్దిని గుర్తించకపోవడం బాధకరం
సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు గవర్నర్.. విద్య, వైద్య-ఆరోగ్య రంగాలకు కీలక ప్రాధాన్యత ఉందన్న ఆయన.. నవరత్నాలు చాలా వర్గాలకు భద్రతగా ఉన్నాయని వివరించారు.. వైఎస్సార్ రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాలు, సున్నా వడ్డీ.. రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు.. ఆరోగ్య శ్రీ, 104, 108 వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు.. ఫ్యామిలి ఫిజిషియన్ కార్యక్రమం మంచి మార్పులు తెస్తుంది. గ్రామీణ పేదరిక నిర్మూలనలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.. వైఎస్సార్ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల వల్ల మహిళలకు ఆర్ధిక సాధికారత లభిస్తోందన్నారు.. విలేజ్, వార్డ్ సచివలయాల వల్ల సామాన్యులకు పాలన దగ్గర అయ్యిందని.. పేదలకు ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు.
రాష్ట్ర పారిశ్రామికం అభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు గవర్నర్ బిశ్వభూషణ్.. పోర్టులు, ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది.. నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఫోకస్ పెట్టడమే కాకుండా.. దిశ యాప్ తో మహిళలకు భద్రతకు భరోసా ఇస్తోందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి వెళ్తున్నారని.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారని చెప్పుకొచ్చారు.. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడమే కాకుండా పాలనపై ప్రత్యేక దృష్టిపెట్టింది ప్రభుత్వం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డైనమిక్ నాయకత్వం, మానవీయ దృక్పథంతో రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తుందన్నారు.. ఇదే స్ఫూర్తితో అభివృద్ధి సాధించింది రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఆకాక్షించారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్..