NTV Telugu Site icon

Abdul Nazeer: గ్రామీణ వ్యాపార, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిలో నాబార్డు పాత్ర ఎంతో ముఖ్యమైంది

Abdul Nazeer

Abdul Nazeer

AP Governor Abdul Nazeer Speech In Nabard 42 Years Celebrations: గ్రామీణ వ్యాపార, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిలో నాబార్డు ప్రధాన పాత్ర పోషించిందని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రాజెక్టుల అభివృద్ధి కూడా నాబార్డు ఎంతో తోడ్పడిందని కొనియాడారు. మంగళవారం ఘనంగా నిర్వహించిన నాబార్డు 42వ ఆవిర్భావ దినోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1982 జులై 12వ తేదీన నాబార్డు ఆవిర్భవించిందని, ఈరోజు ఈ సంస్థ 42వ ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. నాలుగు దశాబ్దా్లో నాబార్డు 8.01 లక్షల కోట్ల టర్నోవర్‌కు చేరిందని తెలిపారు.

Vithika Sheru : యూట్యూబ్ వీడియోలతో లక్షల్లో సంపాదిస్తున్న వితిక..

రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా నాబార్డు వాళ్లు ఎంతో ఉపయోగకరమైన పనులు చేస్తున్నారని అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. రూ.47,695 కోట్లతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు నాబార్డు రీజనల్ అధికారులు ఏపీలో ఆమోదం తెలిపారని, అందుకు వారికి నా అభినందనలని తెలుపుతున్నానని అన్నారు. PACS అభివృద్ధిలోనూ నాబార్డు పాత్ర ఎంతో ప్రముఖమైందన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లోనూ నాబార్డు ప్రధాన పాత్ర పోషించిందని.. గ్రామీణ ప్రజల జీవనాధారమైన వ్యవసాయ సంబంధిత అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేసిందని తెలియజేశారు. వ్యవసాయ గ్రామీణాభివృద్ధి కార్యల్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డు తన సహకారం కొనసాగించాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. కాగా.. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ను పొందూరు ఖద్దురుతో చేసిన కండువా కప్పి సత్కరించారు.

Adipurush: రాత్రి తాగేసి పొద్దున్నే దేవుడంటే ఎలా?.. కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

అనంతరం నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ.. నాబార్డ్ చాలా అవకాశాలు తయారు చేసి.. రైతులకు, మహిళలకు ఉపయోగపడే విధంగా పనిచేసింద్నారు. వ్యవసాయ, గ్రామీణ స్ధాయిలో 1600 కోట్ల పెట్టుబడి ఏపీ ప్రభుత్వంతో కలిసి చేశామన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరెషన్‌తో కలిసి రూ.3000 కోట్ల మూలధన పెట్టుబడి పెట్టామన్నారు. ఆదివాసీ ప్రాజెక్టుల్లో 30వేల ఎకరాల్లో అభివృద్ధికి పెట్టుబడి పెట్టామన్నారు. ఆదివాసీ, గ్రామీణ ఉత్పత్తుల అమ్మకాలకు మాల్స్‌లో స్టాల్స్ ఏర్పాటు చేశామన్నా ఆయన.. సహజ వనరులు ఎక్కువగా ఉన్న ఏపీలో ప్రత్యేక కార్యాలయాలు తమకున్నాయన్నారు.