Site icon NTV Telugu

తీపికబురు అందించిన ఏపీ ప్రభుత్వం.. వారి ఖాతాల్లోకి త్వరలోనే రూ.703 కోట్లు

సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. అర్హులుగా ఉండి ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారికి జగన్ సర్కారు తీపికబురు అందించింది. ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధిని పొందని 18.48 లక్షల మంది అకౌంట్లలో సంక్షేమ పథకాలకు సంబంధించి రూ.703 కోట్లను జమ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

Read Also: రాజమండ్రికి కేంద్రం న్యూ ఇయర్ కానుక.. ఓఆర్‌ఆర్‌ మంజూరు

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి త్వరలోనే లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదును జమ చేయనున్నారు. ఇకపై అర్హులుగా ఉండి.. ఏదైనా కారణం చేత సంక్షేమ పథకాలు పొందని వారికి ప్రతి ఏడాది జూన్, డిసెంబర్‌ నెలల్లో లబ్ధి చేకూరుస్తామని ఏపీ సర్కారు వెల్లడించింది. మరోవైపు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులను మంజూరు చేసింది. ఆయా గ్రామాలకు రూ.134.95 కోట్ల ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నాలుగు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version