ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని తెలిపారు ప్రభుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు.. ఆర్ధిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా.. సంక్షేమ రంగానికి భారీ కేటాయింపులు జరిపామన్నారు.. ప్రతి పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసే ప్రభుత్వం తమదని స్పష్టం చేసిన ఆయన.. కరోనా కష్టకాలంలో చికిత్స కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.. ఈ సమయంలో.. 40 ఏళ్ల ఇండస్ట్రీ పక్క రాష్ట్రంలో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. ఇక, మాక్ అసెంబ్లీ పేరుతో అర్ధం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డ శ్రీనివాసులు.. ఎస్సీలకు బడ్జెట్‌లో పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపామన్నారు.. ప్రతిపక్షాలు ప్రజలకు అండగా నిలబడడంలో విఫలం అయ్యాయని విమర్శించారు. మరోవైపు.. మంచి బడ్జెట్ ప్రవేశపెట్టాం.. కష్టకాలమైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం తమది అన్నారు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. రఘ రామకృష్ణం రాజు లాంటి వ్యక్తిని పట్టుకుని రాజకీయం చేస్తోంది టీడీపీ అని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కరోనా సాకు చెప్పి అసెంబ్లీకి రాని చంద్రబాబు.. తిరుపతి ఎన్నికల ప్రచారంలో మాత్రం తిరునాళ్లల్లో తప్పిపోయిన పిల్లాడిలా తిరిగారంటూ ఎద్దేవా చేశారు.
జగన్ పాలనకు ప్రజల జేజేలు.. సంక్షేమానికి భారీ కేటాయింపులు..
koramutla srinivasulu