ప్రైవేట్ ఆస్పత్రుల కోవిడ్ దందాపై ఏపీ సర్కార్ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కష్టకాలం కనీసం మానవత్వాన్ని చూపకుండా.. అందినకాడికి దండుకునే దందా కొనసాగిస్తున్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు.. అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల కోవిడ్ దందాపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. తప్పిదాలకు పాల్పడిన ప్రైవేట్ ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.. ఇప్పటికే నిబంధనలు పాటించని చాలా ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నాం.. ఫైన్లు కూడా వేశామన్నారు.. కోవిడ్ పేషంట్ల నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదని ప్రభుత్వం భావిస్తోందన్న ఆయన.. రెెండో సారి ఆస్పత్రి యాజమాన్యాలు తప్పులు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగే ట్రీట్మెంట్.. బిల్లింగ్ పై నోడల్ ఆఫీసర్లు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారని తెలిపారు.
ఇక, మూడో దశ కోవిడ్ వస్తే ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు అనిల్ కుమార్ సింఘాల్.. మూడో దశ కరోనాలో పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అంచనాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన.. మూడో దశ కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నామని.. కమిటీ వేసుకున్నామని వెల్లడించారు.. మరోవైపు.. పాజిటివిటీ రేట్ రోజు కంటే తగ్గిందన్న ఆయన.. ఇవాళ 19 శాతం మేర పాజిటివిటీ రేట్ నమోదైందని.. ఐసీయూ బెడ్లు 812, ఆక్సిజన్ బెడ్లు 3552 అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. కోవిడ్ కేర్ సెంటర్లల్లో 16689 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక, పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య పెరిగిందని.. అడ్మిషన్లు తక్కువగా ఉన్నట్టు చెప్పారు అనిల్ కుమార్ సింఘాల్.
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
- Aqua Feed Price Reduction: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జోక్యంతో తగ్గిన ఫీడ్ ధరలు
- YS Jagan: సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చిన జగన్.. కృష్ణలంక ఘటనలపై సీరియస్.. సీబీఐ విచారణకు డిమాండ్..
- AP High Court: ‘వెళ్లి సరెండర్ అవ్వండి’.. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..