ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతూనే ఉంది. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ సృష్టిస్తున్న అడ్డంకులు, అవరోధాలు, అక్రమాలపై సుప్రీంకోర్టులో తాజాగా ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. “కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు” పరిధిని వెంటనే నోటిఫై చేయాలని… తెలంగాణ ప్రభుత్వం జూన్ 28న జారీ చేసిన జీవోను రద్దు చేయాలని ఈ పిటిషన్ లో పేర్కొంది ఏపీ సర్కార్.
read also : హుజురాబాద్ ఉప ఎన్నిక : రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఏపీ న్యాయమైన వాటాకు తెలంగాణ ప్రభుత్వం గండి కొడుతోందని…తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని తెలిపింది. తాగు, సాగునీటి జలాలు దక్కకుండా ప్రజల జీవించే హక్కును హరిస్తోందని పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఇది ఇలా ఉండగా.. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంపై ఎన్జీటీలో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
