హుజురాబాద్ ఉప ఎన్నిక : రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం

కరీంనగర్ జిల్లా : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే అన్ని పార్టీలు ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి, సమన్వయ కర్తలను, మండల బాధ్యులను ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహను నియమించగా… నియోజక ఎన్నికల సమన్వయకర్తలుగా.. ఎమ్మెల్స్ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లను నియమించారు.

read also : ఇవాళ మరోసారి భేటీ కానున్న తెలంగాణ కేబినెట్


వీణవంక మండలానికి ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్ లను మండల బాధ్యులుగా నియమించగా.. జమ్మికుంట మండలానికి విజయ రమణరావ్, రాజ్ ఠాగూర్ లను నియమించారు. ఇక హుజురాబాద్ మండలానికి టి.నర్సారెడ్డి, లక్షన్ కుమార్ కాగా… హుజురాబాద్ టౌన్ కు బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావులను నియామించారు రేవంత్‌ రెడ్డి. ఇల్లందకుంట మండలానికి..నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి లను నియమించగా.. కమలపూర్ మండలానికి కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్య లను నియామకం చేశారు. కంట్రోల్ రూమ్ సమన్వయ కర్తగా కవ్వంపల్లి సత్యనారాయణను నియమించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-