AP Government: పరిశ్రమలకు గుడ్‌న్యూస్.. పవర్ హాలిడే ఎత్తివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధిక ఉష్ణోగ్రతలతో విద్యుత్‌కు డిమాండ్ పెరిగిపోయింది.. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో కోతలు తప్పలేదు.. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే, మళ్లీ విద్యుత్ డిమాండ్ తగ్గడంతో.. పరిశ్రమలకు పవర్ హాలిడే ఎత్తివేసింది ప్రభుత్వం.. పరిశ్రమలకు విద్యుత్ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిందని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 186 మిలియన్ యూనిట్ల వినియోగం మాత్రమే ఉందని.. దీంతో, పరిశ్రమలకు విధించిన పవర్ హాలిడేను ఉపసంహరిస్తున్నామని వెల్లడించారు.
Read Also: Narayana Arrest: అందుకే నారాయణ అరెస్ట్.. పోలీసుల ప్రకటన
Also Read
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- Nadendla Manohar: డీఎస్సీపై అవకతవకలు జరిగితే అసెంబ్లీ ధైర్యంగా మాట్లాడండి..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ కసరత్తు.. అభ్యర్థుల ఖరారుపై మాజీ సీఎం జగన్ కీలక సూచనలు..
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
పరిశ్రమలు వినియోగించాల్సిన విద్యుత్ ను కూడా 70 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి.. ఆహారశుద్ధి, కోల్డ్ స్టోరేజి, ఆక్వా పరిశ్రమలకు 100 శాతం విద్యుత్ వినియోగానికి అనుమతి ఇస్తున్నామని.. ప్రస్తుతం ఏపీ అవసరాల కోసం 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల్లో ఇంకా విద్యుత్ కొరత ఉందన్నారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని.. ఆరు నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నామని వెల్లడించారు. శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు ద్వారా ఏడాదిలో 33 శాతం మేర విద్యుత్ ఆదా అయ్యిందన్న మంత్రి పెద్దిరెడ్డి.. ఆ మేరకు డిస్కమ్ లు తీసుకునే సబ్సిడీ తగ్గిందని.. ప్రస్తుతం ఏపీలో వ్యవసాయ సబ్సిడీగా 10 వేల కోట్లు ఇస్తున్నామని గుర్తుచేశారు.
తాజావార్తలు
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!