గుడ్‌న్యూస్.. ఇక ఎక్కడైనా పెన్షన్ తీసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి నెల 1వ తేదీ వచ్చిందంటే చాలు.. ఎక్కడున్నా సరే స్వగ్రామానికి వెళ్లాలి, లేదంటా పెన్షన్ కట్ అవుతుంది అనే టెన్షన్ చాలా మంది వృద్ధులు, ఇతర పెన్షన్ దారుల్లో ఉంటుంది.. పెన్షన్ కోసం ఇతర ప్రాంతల నుంచి స్వగ్రామానికి వెళ్లివచ్చేవారు కూడా లేకపోలేదు.. ఇక, ఎలాంటి ఇబ్బంది లేకుండా.. వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటి వరకు గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందజేస్తున్నారు. నెలనెలా దాదాపు 95 శాతం మందికి పెన్షన్లు ఇంటివద్దే అందిస్తున్నారు. వేలిముద్రలు పడకపోవడం, లబ్ధిదారులు ఇళ్లవద్ద లేకపోవడంతో అలాంటి వారికి మాత్రం సాయం అందకుండా పోతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది..
ఇకపై రేషన్ మాదిరిగానే పెన్షన్ కూడా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా తీసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్.. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. వ్యక్తిగత, కుటుంబ, ఆరోగ్య కారణాల వల్ల స్వగ్రామాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఈ అవకాశం వర్తింపజేయాలని పేర్కొంది.. అయితే, 6 నెలల పాటు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నట్లు వారు ధ్రువీకరించాల్సి ఉంటుందని వెల్లడించింది.. అలాగే లబ్ధిదారులు నివాసముంటున్న గ్రామ/ వార్డు వాలంటీర్ ద్వారా సచివాలయానికి లబ్ధిదారులను మ్యాపింగ్ చేస్తామంటుచున్నారు అధికారులు.. కాగా.. ప్రస్తుతం వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, డయాలసిస్ పేషెంట్లు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు ఇస్తోంది జగన్ సర్కార్.. అయితే, ప్రతీ నెల స్వగ్రామానికి రావడం కొందరికి ఇబ్బందిగా మారింది.. కానీ, ప్రభుత్వ నిర్ణయంతో మొత్తంగా పెన్షన్ దారులకు ఇది ఊరట కలగనుంది.
Also Read
- AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
- AP Assembly: నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్‌తో ప్రారంభం కానున్న శాసనసభ!
- Bandi Sanjay: బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదు..!
- OTR: ఏలూరు కూటమిలో రగులుతున్న కుమ్ములాటలు! నేతల మధ్య కోల్డ్ వార్!
తాజావార్తలు
-
Virat Kohli: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో.!
-
Anirudh – Kavya Maran Wedding : కావ్య మారన్ – అనిరుధ్ పెళ్ళికి వేదిక రెడీ?
-
Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
-
This Week Theatrical Releases: పృథ్వీరాజ్ ‘ఖలీఫా పార్ట్ 1’ నుండి రవి తేజ ‘ఇరుముడి’ వరకు.. ఈ వారం థియేటర్లలో చూడాల్సిన సౌత్ సినిమాలు..
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
ట్రెండింగ్
-
Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!