Site icon NTV Telugu

AP: వైద్యారోగ్యశాఖలో బదిలీల గడువు పొడిగింపు

వైద్యారోగ్య శాఖలో ఉద్యోగుల బదిలీల గడువును పొడిగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఉద్యోగుల బదిలీల గడువును మార్చి 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఉద్యోగులు ఫిబ్రవరి 25 తేదీ నుంచి మార్చి 3 తేదీ వరకు ఆన్‌లైన్‌లో బదిలీ అప్షన్లు ఇవ్వొచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం… ఇక, మార్చి 4 నుంచి 8 తేదీ వరకు సంబంధిత హెచ్‌వోడీల నేతృత్వంలో కౌన్సిలింగ్ జరుగుతుందని తన ఉత్తర్వుల్లో వైద్యారోగ్య శాఖ పేర్కొంది.. బదిలీ ప్రక్రియను మార్చి 20లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.. మరోవైపు, మార్చి 31 తేదీ నుంచి వైద్యారోగ్య శాఖలో బదిలీలపై నిషేధం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, గతంలో వైద్యారోగ్యశాఖలో బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ.. బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

Read Also: Ukraine Crisis: కేసీఆర్‌ ఆదేశాలు.. ప్రత్యేక హెల్ప్‌లైన్‌ కేంద్రాలు

Exit mobile version