Site icon NTV Telugu

Ragi and Sorghum: గుడ్‌న్యూస్‌.. రేషన్‌ కార్డుపై రాగులు, జొన్నలు పంపిణీ..

Karumuri Nageswara Rao

Karumuri Nageswara Rao

Ragi and Sorghum: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ కార్డు దారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ప్రభుత్వం.. త్వరలో రేషన్‌కార్డులపై రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరిస్తున్నాం.. రైతులకు మద్దతు ధర ప్రకటించి అమలు చేశామన్నారు.. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 90శాతం చెల్లింపులు చేశాం.. 21 రోజులల్లోపే ధాన్యం సేకరణకు సంబంధించి సొమ్ములు చెల్లిస్తున్నామని వెల్లడించారు.. ఈ ఏడాది 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం, మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 900 కోట్లు ఉన్నాయని.. మిల్లర్ల పాత బకాయిలన్నింటినీ ఈ ఏడాదిలో చెల్లిస్తామని ప్రకటించారు. ఇంటింటికీ రేషన్ ఇచ్చే ఎంటీయూ బండ్ల వారుకి ఇన్సురెన్స్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లుస్తుందని.. రాష్ట్రంలో ఉన్న 9250 ఎంటీయూ బండ్లన్నీ పని చేస్తూ ఉన్నాయి.. ఏ బండీ ఆగలేదని స్పష్టం చేశారు.

Read Also: Ayyanna Patrudu: హోం మంత్రి అవుతానని నేనేం అనలేదు.. కాకపోతే..!

అయితే, కందిపప్పు బాగోలేదని చాలా మంది ఫిర్యాదు చేశారు.. బండి వద్దే కందిపప్పును ఉడకబెట్టి నాణ్యత పరిశీలించాలని ఆదేశించామని.. విచారణ కొనసాగుతోంది.. లోపాలు ఉంటే.. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి కారుమూరి.. రేషన్ కార్డు దారులకు రాగులు, జొన్నలు తీసుకునే విషయమై వాలంటీర్లతో సర్వేలో చేశాం.. రేషన్ కార్డుదారులందరూ రాగులు, జొన్నలు కావాలని కోరారని.. మొదటగా రాష్ట్రంలో రాయలసీమ జిల్లాల్లో పేదలకు రాగులు, జొన్నలు పంపిణీ చేస్తాం.. దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు.. మరోవైపు.. పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ది చేస్తున్నా విమర్శలు చేయడం సరైంది కాదని హితవుపలికారు.. వెంట్రుక వాసి లోపాలను పెద్దవిగా చేసి చూపవద్దని కోరిన ఆయన. అక్కడక్కడ రైస్ మిల్లర్ల వల్ల సమస్యలు వచ్చాయి.. ఇప్పటికే మూడు రైస్ మిల్లులను సీజ్ చేశామన్నారు.. అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.. రంగు మారిన ధాన్యాన్ని మార్చి15 లోపు కొనాలని నిర్ణయించామని తెలిపారు.. రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేయడం వెనుక కొంతమంది దళారులు ప్రోత్సాహం ఉందని.. దళారులే ఆందోళన చేయించినట్లు ఇంటలిజెన్స్ నివేదికలు వచ్చాయి. .వీరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.

Exit mobile version