Site icon NTV Telugu

సోమువీర్రాజు త‌న వ్యాఖ్యలు వెన‌క్కి తీసుకోవాలి.. క్షమాపణ చెప్పాలి..

బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. క‌డ‌ప ఎయిర్‌పోర్టు విష‌యంలో చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి.. అయితే, ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు ప్ర‌భుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్న ఆయ‌న‌.. కడప ప్రజలు మనుషులను చంపుతారని వారికి ఎయిర్ పోర్టు అవసరమా అని సోమువీర్రాజు వ్యాఖ్యలు చేయడం శోచనీయం అన్నారు.. ఆయన తన మాటలు వెంట‌నే వెనక్కు తీసుకోవాలి.. క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Read Also: డ్ర‌గ్స్‌పై ముగిసిన డీజీపీ స‌మీక్ష‌.. వాళ్ల చిట్టా సిద్ధం..

లాభాల కోసం సినిమాల్లో ఆ ప్రాంత సాంస్కృతిని దిగజార్చార‌ని మండిప‌డ్డారు శ్రీ‌కాంత్ రెడ్డి.. ఆ ప్రాంతంలో బీజేపీ జెండా పట్టుకుని తిరిగే వారున్నారు.. వాళ్లయినా, సోము వీర్రాజు అయినా ఈ వ్యాఖ్యలపై సిగ్గుపడాల‌న్న ఆయ‌న‌.. రాయల సీమ ప్రజలను ఫ్యాక్షనిస్టులుగా చిత్రీకరణ చేశారు.. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్ లు నమోదు అవుతూన్నాయో సోము వీర్రాజు చూడాల‌ని హిత‌వుప‌లికారు.. వెంట‌నే ఆయ‌న వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.. రాయల సీమ సంస్కృతిని సినిమాల్లోనే కించపరిచేలా వ్యవహరించార‌ని.. టీడీపీ తన పబ్బం గడుపుకోవడం కోసం ఫ్యాక్షన్ గొడవలు రేపింద‌ని ఆరోపించిన ఆయ‌న‌.. మద్దెలచెరువు సూరికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు తిరస్కరించిన ఘనత వైఎస్ ది అని గుర్తుచేశారు.. టీడీపీ పెట్టె వ్యూహాత్మక సమావేశాలకు కుట్ర మీటింగ్‌లని పేరు పెట్టుకోవాల‌ని ఎద్దేవా చేశారు శ్రీ‌కాంత్‌రెడ్డి.

Exit mobile version