కరెంట్ కోతలపై సోషల్ మీడియాలో వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఇంధన శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా కొన్ని సార్లు సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చినా.. కొన్ని పుకార్లు కూడా షికార్లు చేస్తుంటాయి.. తాజాగా, కరెంట్ కోతలు విధిస్తున్నట్లు.. విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన వైరల్‌గా మారిపోయింది.. దీంతో చివరకు ఇంధన శాఖ దానిపై స్పందించాల్సి వచ్చింది.. దసరా పండుగ తర్వాత గ్రామాలు, మున్సిపాల్టీలు, నగరాల్లో లోడ్ రిలీఫ్ పేరిట గంటల కొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించింది. బొగ్గు నిల్వలు, సరఫరాల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఉన్న పరిణామాలు విద్యుత్ ఉత్పత్తిపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయని ప్రకటనలో పేర్కొన్న ఇంధన శాఖ.. అయినా, వినియోగదారులకు నాణ్యమైన కరెంటు సరఫరా చేసేందుకు విద్యుత్‌పంపిణీ సంస్థలు కృషి చేస్తున్నాయని వెల్లడించింది.
ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అత్యవసర ప్రణాళికల అమలు చేపట్టామని వెల్లడించింది ఇంధన శాఖ.. ఏపీ జెన్కోకు బొగ్గు కొనుగోలు కోసం ప్రభుత్వం రూ. 250 కోట్లు కేటాయించిందని తెలిపింది.. రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించారని తన ప్రకటనలో పేర్కొంది. దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడవున్నా కొనుగోలు చేయాలని ఏపీ జెన్కోకు ఆదేశాలు అందాయని క్లారిటీ ఇచ్చింది.. మార్కెట్ ధర ఎంత ఉన్నా అత్యవసర ప్రాతిపదికన కొనాల్సిందిగా పంపిణీ సంస్థలకు ఆదేశించారని తెలిపింది. కాగా, విద్యుత్ సంక్షోభంపై ఈ మధ్యే సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా.. తీసుకోవాల్సిన అన్ని చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Also Read
- YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
- CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
- Tags
తాజావార్తలు
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?