NTV Telugu Site icon

Ap Employees Talks: మంత్రుల కమిటీతో ఉద్యోగసంఘాల భేటీ

Venkatrami Apgovt

Venkatrami Apgovt

ఏపీలో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల సమావేశం ముగిసింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం (Employees Health scheme) మీద ఎక్కువ సమయం చర్చ జరిగిందని సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి చెప్పారు. ఆరోగ్య శ్రీ ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్ వారు తీసుకుంటున్నారు. కానీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (EHS) ని మాత్రం అనుమతించడం లేదు. EHS కూడా ఇతర రాష్ట్రాలలో అమలు చేసే విధంగా ఉత్తర్వులు ఇస్తాము అని హామీ ఇచ్చారన్నారు.

కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసే అంశం మీద చర్చించాం.. దానికి కమిటీ నియమిస్తాం. త్వరలో పరిష్కారం చూపుతాం అని చెప్పారు. యూనివర్సిటీ కాలేజీల్లో పని చేసే వాళ్ళకి 62 ఏళ్ళకు సర్వీస్ పెంచాలని అడిగాం. త్వరలో జీవో ఇస్తామని చెప్పారన్నారు వెంకటరామిరెడ్డి. GPF అమౌంట్ ఈ నెల చివరి నాటికి వారి వారి అకౌంట్స్ లో వేస్తాం అని చెప్పారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు.

GPF లోన్ పెట్టుకుంటే ఇంత వరకు అమౌంట్ సరైన టైమ్ లో రావడం లేదు.కూతురు పెళ్లికి GPF పెట్టుకుంటే మనవరాలు పుట్టిన రోజుకి, బారసాలకి లోన్ వస్తుంది. గ్రామవార్డు సచివాలయం ఉద్యోగులను కొంతమందిని రెగ్యురలైజ్ చేశారు, మరి కొంతమందిని చేయాల్సి ఉంది వారిని కూడా చేస్తామన్నారు.హెల్త్ డిపార్ట్మెంట్ 54 డిమెండ్‌ల మీద శుక్రవారం మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు బండి శ్రీనివాసరావు.

Udayagiri Assembly constituency :ఆ నియోజకవర్గంలో టికెట్ కోసం స్పీడందుకున్న అధికార పార్టీ నేతల కదలికలు