NTV Telugu Site icon

DGP Rajendranath Reddy: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై స్పందించిన డీజీపీ..

Dgp Rajendranath Reddy

Dgp Rajendranath Reddy

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వాట్సాప్‌ వీడియో కాల్‌ లీక్‌ పెద్ద కలకలం సృష్టించింది.. దానిపై ఫోరెన్సిక్‌ నివేదికలు.. దానికి కౌంటర్లు.. ధర్నాలు, ఆందోళనలు.. ఇలా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య రచ్చే జరిగింది.. అయితే.. అ విషయంపై ఇవాళ స్పందించారు.. ఏజీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కుప్పంలో జరిగిన ఘటనలపై సమీక్ష జరుగుతోంది… కుప్పం ఘటనలు మరీ పెద్దవి కాదు… లా అండ్ ఆర్డర్ అదుపు తప్పేలా అక్కడ ఏమీ జరగలేదన్నారు.. ప్రతిదానికీ పోలీసులను బాధ్యులను చేయడం సరికాదని హితవుపలికిన ఆయన.. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో క్రైమ్ రేట్ తగ్గుతోందన్నారు.. మహిళలపై దాడులు, ఆస్తుల ధ్వంసం, రోడ్డు ప్రమాదాలు లాంటి ఘటనలు తగ్గాయని వెల్లడించారు..

Read Also: TSPSC: గ్రూప్ II, గ్రూప్ III నోటిఫికేషన్లపై టీఎస్‌పీఎస్సీ ఫోకస్‌..

ఇక, రానున్న బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవోతో చర్చించాం… ఈ దఫా భారీగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోందన్నారు.. అందుకు తగ్గ భద్రతా ఏర్పాట్లు చేస్తాం అని తెలిపారు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి.. మరోవైపు.. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో విషయంలో ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు డీజీపీ.. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ కు రిపోర్ట్ ఇస్తున్నాం.. ఈ వ్యవహారంలో సీఐడీ విచారణ జరుగుతున్నట్టు తెలిపారు.. ఇక, అనంతపురం ఘటనపై విచారణ జరుగుతోందని తెలిపారు.. కానిస్టేబుల్ ప్రకాష్ పై చాలా ఆరోపణలు ఉన్నాయి… ఈ కేసులో మేం చట్టప్రకారమే నడుచుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు.. సెప్టెంబర్ 11న ఉపాధ్యాయుల ఆందోళనకు సంబంధించి మాకు ఎలాంటి సమాచారం లేదన్నారు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి.

Show comments