జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో.. పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… బీజేపీ రోడ్ మ్యాప్ రావాల్సి ఉందన్న ఆయన.. తాము ఎవరితోనైనా పొత్తులకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు.. దీంతో.. మరోసారి టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుందనే విమర్శలు పెరిగాయి.. ఇక, జనసేనానిపై ఫైర్ అవుతున్నారు అధికార వైసీపీ నేతలు.. తాజాగా, పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… పవన్ కల్యాణ్‌కి దమ్ముంటే సింగిల్‌గా పోటీ చేయాలని.. పొత్తులు లేకుండా గెలిచి చూపించాలని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇక, వీక్‌గా ఉండేవారే పొత్తులు పెట్టుకుంటారు అంటూ ఎద్దేవా చేశారు నారాయణ స్వామి.. మరోవైపు, మంత్రుల్లో ఎవరికి అసంతృప్తి లేదని స్పష్టం చేసిన ఆయన.. ఎవరికి ఏ పదవులు ఇచ్చినా.. సీఎం వైఎస్ జగన్ కోసం అంతా పనిచేస్తారని స్పష్టం చేశారు.
Read Also: Narayana Swamy: చంద్రబాబుపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఆ అర్హత కూడా లేదు..!
