టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి… చిత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆయన… సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు… చంద్రబాబు 30 ఏళ్లు ఏం పీకారు అంటూ ఫైర్ అయ్యారు.. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు ఏమి పీకాడు… మా సీఎం వైఎస్ జగన్‌ను పట్టుకుని కుప్పానికి వెళ్లి ఏం పీకుతాడు అని చంద్రబాబు మాట్లాడుతాడా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు… సీఎం జగన్మోహన్‌రెడ్డికి అపూర్వ స్వాగతం పలకడానికి కుప్పం ప్రజలు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు నారాయణస్వామి.. ఇక, చరిత్రలో నిలిచిపోయాలే కుప్పంలో వైఎస్ జగన్ పర్యటన జరుగుతుందన్నారు ఎమ్మెల్సీ, కుప్పం వైసీపీ ఇంఛార్జ్ భరత్.. పులివెందలలో వైఎస్ జగన్ మెజారిటీ పెరుగుతుంటే… కుప్పంలో చంద్రబాబు మెజార్టీ పడిపోతా ఉందని ఎద్దేవా చేసిన ఆయన.. ఓటమి భయంతో చంద్రబాబు అబద్ధాలకు బ్రాండ్‌గా మారాడంటూ మండిపడ్డారు.
Read Also: Komatireddy Rajagopal Reddy: బీజేపీ తరపున మరో ‘ఆర్’ గెలవడం ఖాయం
కాగా, రేపు కుప్పంలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్.. సీఎం పర్యటన సందర్భంగా సర్వాంగ సుందరంగా కుప్పాన్ని ముస్తాబు చేశారు.. కుప్పాన్ని వైసీపీ జెండాలతో నింపేశారు నేతలు.. 175/175.. ఫస్ట్ టార్గెట్ కుప్పం అంటూ పెయింటింగ్స్ వేశారు. ఇక, శుక్రవారం 3వ విడత వైఎస్‌ఆర్ చేయూత పథకాన్ని కుప్పంలో ప్రారంభిస్తారు సీఎం.. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 26,39,703 మంది మహిళలకు రూ.4,949.44 కోట్లు లబ్ది చేకూరనుంది. చిత్తూరు జిల్లాలో 1,02,584 మంది లబ్దిదారులకు రూ.192.34 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం.. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 నుండి 60 ఏళ్ల వయసు మధ్య గల అర్హులైన మహిళలకు ఒక్కొక్కరికి రూ. 18,750లను బటన్ నొక్కి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. చిత్తూరు జిల్లాకు చెందిన 1,02,584 మంది లబ్దిదారులకు రూ.192.34 కోట్లు లబ్ది చేకూరనుండగా.. ఒక్క కుప్పం నియోజకవర్గానికి చెందిన 15,011 మంది మహిళలకు రూ.28.14 కోట్లు వారి ఖాతాల్లో జమ కానున్నాయి.