Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Cs Sameer Sharma Falls Sick During Review Meeting With Bank Offcials

CS Sameer Sharma: ఏపీ సీఎస్ సమీర్ శర్మకు తీవ్ర అస్వస్థత

Published Date :November 3, 2022 , 4:17 pm
By Sudhakar Ravula
CS Sameer Sharma: ఏపీ సీఎస్ సమీర్ శర్మకు తీవ్ర అస్వస్థత
  • Follow Us :
  • google news
  • dailyhunt

CS Sameer Sharma Falls Sick: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో బ్యాంకు అధికారులతో సమీక్ష చేస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు.. వెంటనే ఆయన్ను అధికారులు ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రిలో చేర్చారు.. అయితే, సమీర్ శర్మ గత నెలలో కూడా అస్వస్థతకు గురయ్యారు.. ఇటీవలే హైదరాబాద్‌లో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు.. ఆ తర్వాత దాదాపు వారం రోజుల నుంచి విధులకు హాజరవుతున్నారు.. ఇవాళ సచివాలయంలో సమీక్ష చేస్తున్న సమయంలో మరోసారి అస్వస్థతకు గురయ్యారు.. ఓ పక్కకు ఒరిగిపోయిన సీఎస్‌ను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు.. ప్రస్తుతం సీఎస్ సమీర్ శర్మ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Tirumala Temple: శ్రీవారి భక్తులకు అలర్ట్.. 8న శ్రీవారి ఆలయం మూసివేత..

కాగా, ఇవాళ సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మతో భేటీ అయ్యింది ఎస్బీఐ నవీన్ చంద్ర ఝా సీజీఎం బృందం.. అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ఈ సమావేశం జరిగింది.. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వారా అమలు చేస్తున్న వివిధ రుణ సౌకర్యాలకు సంబంధించిన పథకాలు, బీమా, ఉద్యోగులకు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి సీఎస్‌కు వివరించారు.. అదే విధంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వారా ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల సేవల గురించి ఎస్బీఐ ఉన్నతాధికారులు వివరాలు చెప్పారు.. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొనగా.. సమావేశంలోనే అస్వస్థతకు గురయ్యారు సీఎస్ సమీర్‌ శర్మ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati
  • Andhra Pradesh
  • Bank Offcials
  • CS Sameer Sharma
  • review meeting

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions