సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట హాజరయ్యారు ఏపీ సీఎస్ సమీర్ శర్మ. తెలిసారి కోర్టు ఎదుట హాజరైనందుకు విచారం వ్యక్తం చేస్తున్నా అని పేర్కొన్నారు ఏపీ సీఎస్ సమీర్ శర్మ. “కోవిడ్” పరిహారం కోసం 49,292 దరఖాస్తులు వచ్చాయన్నారు. సుప్రీం కోర్టు ఎదుట వర్చువల్ గా హాజరయ్యారు. కోవిడ్ పరిహరం చెల్లింపుల్లో జాప్యంపై సుప్రీం కోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే.
కోవిడ్ బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన రూ. 45 కోట్ల మేర బకాయిలు పెండింగులో పెట్టింది ఏపీ ప్రభుత్వం. పరిహారం చెల్లింపులో జాప్యంపై వివరణ ఇచ్చారు సీఎస్ సమీర్ శర్మ. 31 వేల దరఖాస్తులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే 28 వేల మందికి “కోవిడ్” పరిహారం ఇచ్చాం. తిరస్కరించిన 6 వేల దరఖాస్తులను కమిటీ సుమోటోగా తీసుకుని పరిష్కరిస్తుందని చెప్పారు ఏపీ సీఎస్ సమీర్ శర్మ.
తిరస్కరించిన దరఖాస్తుల్లో ఏమైనా లోపాలుంటే సరిచేసుకునేందుకు అవకాశం ఇస్తాం. అర్హత ఉన్న దరఖాస్తుదారులందరికీ పరిహారం చెల్లిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు ఏపీ సీఎస్ సమీర్ శర్మ. వివరాలను పొందుపరుస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్నారు జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం. ఓ వారంలో అందరికీ డబ్బులు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. ఇకపై తానే వ్యక్తిగతంగా అందరు బాధితులకు పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు సీఎస్ సమీర్ శర్మ. రెండు వారాలు సమయం ఇస్తే… బాధితులకు పరిహారం అందించి.. అన్ని వివరాలు కోర్టుకు తెలియజేస్తా అన్నారు సమీర్ శర్మ. తదుపరి విచారణ ఫిబ్రవరి 4 కు వాయిదా వేసింది సుప్రీంకోర్ట్.