ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై సీఎస్ సమీర్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు.. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు 6 నెలలు కాదు.. 60 నెలలు కావాలని పేర్కొన్నారు.. రాజధాని ప్రాంతం నుంచి వెళ్లిపోయిన వర్కర్లు, యంత్రాలను రప్పించేందుకే రెండు నెలల సమయం అవసరమన్న ఆయన.. అమరావతిలో పనులు మొదలు పెట్టేందుకే 8 నెలల సమయం పడుతుందన్నారు.. రోడ్ల నిర్మాణం కోసం 16 నెలలు అవసరం అవుతుందని.. రోడ్ల పనులు పూర్తి చేశాక, డ్రైనేజి, నీటి సరఫరా, మౌలిక సదుపాయాలను పూర్తి చేయాలంటే 36 నెలల సమయం పడుతుందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు సీఎస్ సమీర్ శర్మ..
Read Also: AP: సిద్ధమైన కొత్త జిల్లాల ఫైనల్ డ్రాఫ్ట్.. ఏ క్షణంలోనైనా గెజిట్..!
గతంలో రూ.42,231 వేల కోట్లతో పనులు ప్రారంభించారు.. ప్రస్తుతం నిధుల సమీకరణకు మార్చి నెల 23 తేదీన సీఆర్డీఏ బ్యాంకర్లతో సమావేశం నిర్వహించిందని.. కానీ, రాజధాని నిర్మాణం కోసం రుణాలు ఇచ్చే విషయంపై బ్యాంకులు ఇంకా స్పందించలేదని పేర్కొన్నారు సీఎస్… హైకోర్టు ఉత్తర్వుల్లో సూచించిన గడువులోగా రాజధాని నిర్మాణం సీఆర్డీఏకి, ప్రభుత్వానికి సాధ్యం కాదని.. దానికి చాలా ఏళ్లు పడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ప్రధాన మౌలిక సదుపాయాల కల్పనకే కనీసం 5 ఏళ్ల గడువు అవసరం అవుతుందని పేర్కొన్నారు.. రాజధాని నిర్మాణానికి సంబంధించి నిర్దేశించిన గడువును ఎత్తేయాలి లేదా సవరించాలని అఫిడవిట్‌లో పేర్కొన్నారు సీఎస్ సమీర్ శర్మ. కాగా.. ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి మార్చి 3వ తేదీన తీర్పు ఇచ్చింది హైకోర్టు.. నెల రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.. ఈనెల 3 లోగా రైతుల ప్లాట్లలో పనులు పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని సూచిచింది.. ఇక, గడువు ముగుస్తున్నందున ఏపీ ప్రభుత్వం తరఫున సీఎస్ సమీర్ శర్మ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.. 190 పేజీలతో కూడిన అఫిడవిట్‌లో కీలక విషయాలను ప్రస్తావించారు..
