NTV Telugu Site icon

ఏపీ క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.  తాజాగా రాష్ట్రంలో 63,849 శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా, 1461 మందికి పాజిటివ్‌గా తేలింది.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 19,85,182కి చేరింది.  ఇందులో 19,52,736 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 18,882 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక‌, రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 15 మంది మృతి చెందారు.  దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 13,564కి చేరింది.  ప‌శ్చిమ గోదావ‌రిలో 235, కృష్ణా జిల్లాలో 210, చిత్తూరులో 195, గుంటూరులో 182, నెల్లూరులో 195, ప్ర‌కాశం జిల్లాలో 112 కేసులు న‌మోద‌య్యాయి.   గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా నుంచి 2,113 మంది కోలుకున్న‌ట్టుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది.  రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 2,53,11,733 శాంపిల్స్‌ను ప‌రీక్షించిన‌ట్టు ఏపీ ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది.  

Read: టీడీపీకి కొరకరాని కొయ్యగా అనంతపురం పార్టీ నేతలు…!