CM YS Jagan: రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. పన్నెండున్నరకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2.15కు సీఎం జగన్ గోరంట్ల మండలం పాలసముద్రం చేరుకోనున్నారు. మూడు గంటల 10 నిమిషాలకు ప్రధానమంత్రికి సీఎం ఘన స్వాగతం పలకనున్నారు. ప్రధాని, గవర్నర్‌తో కలిసి నాసిన్ – నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. సాయంత్రం ఏడున్నరకు తిరిగి తాడేపల్లికి సీఎం జగన్ చేరుకోనున్నారు.
Read Also: Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట విషాదం..
ప్రధాన పర్యటన షెడ్యూల్..
రేపు(జనవరి 16) ప్రధాని నరేంద్ర మోడీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రానికి చేరుకుంటారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ సెంటర్‌ను సందర్శిస్తారు. ఇక్కడి కొనసాగుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత జరిగే సభలో ప్రసంగిస్తారు ప్రధాని మోడీ. అనంతరం ఢిల్లీకి ప్రయాణమవుతారు. ప్రధాని మోడీ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్‌నజీర్, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి శనివారం జిల్లా అధికారులతో సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దని సూచించారు.