CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పోలవరం అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటే పోలవరం అని వ్యాఖ్యానించిన ఆయన.. పోలవరం కలల ప్రాజెక్టు అని దివంగత మహానేత వైఎస్‌ఆర్ చెప్పారు. పోలవరాన్ని ప్రారంభించింది మా నాన్నే వైఎస్‌ఆరే.. పూర్తి చేసేది ఆయన కుమారుడైన నేనే అంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 800 కోట్లు ఆదా చేశామని తెలిపిన సీఎం జగన్.. తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే స్పిల్ వే.. అప్పర్ కాఫర్ డ్యాం పూర్తయ్యిందని వెల్లడించారు.. అయితే, తానే ప్రాజెక్టు పూర్తి చేశానంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు.
ఐదేళ్ల కాలంలో పోలవరానికి చంద్రబాబు చేసింది ఏంటి? అని ప్రశ్నించారు సీఎం జగన్.. చంద్రబాబు నోటివెంట పోలవరం పేరు ఒక్కసారైన రాలేదని, ప్రాజెక్టు కోసం ఆయన చేసింది ఏమీ లేదని, అసలు పోలవరం అనే పేరు పలికే అర్హత చంద్రబాబుకు లేదని వ్యాఖ్యానించారు.. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు?. 1995 నుంచి 2014 వరకు చంద్రబాబు నోటి వెంట పోలవరం అనే పేరు ఒక్కసారైనా రాలేదు. పైగా టీడీపీ హయాంలో పోలవరం నిధులను యథేచ్చగా దోచేశారు. టీడీపీ హయాంలో ఎక్కువగా డబ్బు వచ్చే పనులను ముందు చేశారు. తక్కువ డబ్బులు వచ్చే పనుల్ని తర్వాత చేపట్టారు. నిధుల ప్రవాహంగానే పోలవరాన్ని చూశారంటూ ప్రధాని నరేంద్ర మోడీచే చెప్పారన్నారు సీఎం వైఎస్ జగన్.. అసెంబ్లీ వేదికగా పోలవరంపై సీఎం జగన్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..