Site icon NTV Telugu

CM YS Jagan: నేడు నెల్లూరు జిల్లాకు సీఎం వైఎస్ జ‌గ‌న్‌…

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ నేడు నెల్లూరు జిల్లాకు బ‌య‌లుదేరుతున్నారు. ఉద‌యం 9:30 గంట‌ల‌కు తాడేప‌ల్లి నివాసం నుంచి బ‌య‌లుదేరి 10 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్క‌డి నుంచి క‌డ‌పకు వెళ్ల‌నున్నారు. క‌డ‌ప నుంచి హెలికాఫ్ట‌ర్ ద్వారా ఉద‌య‌గిరి వెళ్ల‌నున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు ఉద‌య‌గిరిలోని మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అండ్ సెన్సెస్ కాలేజీకీ చేరుకుంటారు. అక్క‌డ దివంగ‌త మేక‌పాటి గౌతం రెడ్డి బౌతిక‌కాయానికి నివాళులు ఆర్పించి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొంటారు.

Read: UP Elections: యూపీలో కొన‌సాగుతున్న పోలింగ్‌…

మేక‌పాటి గౌతం రెడ్డి అంత్య‌క్రియ‌లు ముగిసిన త‌రువాత మధ్యాహ్నం ఒక‌టిన్న‌ర గంట‌ల‌కు తిరిగి తాడేప‌ల్లికి చేరుకుంటారు. ఏపీ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా ప‌నిచేస్తున్న మేక‌పాటి గౌతం రెడ్డి సోమ‌వారం రోజున గుండెపోటుతో మృతి చెందారు. కాగా, గౌతం రెడ్డి మృత‌దేహాన్ని హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో ఏపీకి త‌ర‌లించారు. ఈరోజు ఉద‌యం నెల్లూరు నుంచి ఉద‌య‌గిరి వ‌ర‌కు అంతిమ‌యాత్ర‌ను నిర్వ‌హించారు.

Exit mobile version