Site icon NTV Telugu

నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌తో ఏపీ సీఎం భేటీ.. ఇంత భారాన్ని మోయలేం..!

YS Jagan Rajiv Kumar

YS Jagan Rajiv Kumar

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. బిజీబిజీగా గడుపుతున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన.. వరుసగా కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌లను కలిసిశారు.. ఆ తర్వాత నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌తో భేటీ అయ్యారు.. పలు అభివృద్ధి అంశాలపై చర్చ సాగింది.. పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన కార్యక్రమాలను వివరించిన సీఎం… రాష్ట్రవ్యాప్తంగా 30.76లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని, దీనికోసం 68,381 ఎకరాలను సేకరించినట్టు తెలిపారు.. ఇళ్ల పట్టాల పంపిణీ వల్ల 17,005 కొత్త కాలనీలు ఏర్పాడ్డాయని.. ఈ ఏడాది కొత్తగా 15 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నామని, మొత్తంగా 28.30 లక్షల ఇళ్లు పేదలకోసం నిర్మిస్తున్నామని చెప్పారు.. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం సజావుగా సాగడానికి ప్రతి జిల్లాకు జాయింట్‌ కలెక్టర్‌ను నియమించామన్న సీఎం.. 17,005 కొత్త కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రూ. 34,109 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని.. ఇంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మోయడం కష్టసాధ్యమని వివరించారు.. ఇళ్లు కట్టి.. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుంటే.. లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడతారని, ఇళ్లపట్టాలుకోసం, నిర్మాణంకోసం పెట్టిన ఖర్చు ప్రయోజనాలను ఇవ్వదన్నారు.. దీనికోసం సంబంధిత మంత్రిత్వశాఖలతో మాట్లాడి ఈ కాలనీల్లో మౌలికసదుపాయాలకయ్యే ఖర్చును పీఎంఏవైలో భాగంగాచేయాలని కోరారు సీఎం వైఎస్ జగన్.

మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపైనా రాజీవ్‌కుమార్‌తో మాట్లాడారు సీఎం వైఎస్ జగన్.. పోలవరం పీపీఏతోపాటు, కేంద్ర జలమండలి సిఫార్సులతోపాటు, కేంద్ర జలశాఖకు చెందిన సాంకేతిక సలహామండలి ( టెక్నికల్‌అడ్వైజరీ కమిటీ– టీఏసీ) అంగీకరించిన విధంగా 2017–18 ధరల సూచీ ప్రకారం రూ. 55,656.87 కోట్ల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఆమోదం తెలపాని కోరారు.. ఇక, 2022 జూన్‌నాటికి ప్రాజెక్టు పనులతోపాటు, భూసేకరణ–పునరావాస పనులను పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, వెంటనే ఈ అంచనాలకు ఆమోదం తెలపాని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version