NTV Telugu Site icon

సెంట్ర‌ల్ వ‌ర్సెస్ స్టేట్స్.. అన్ని రాష్ట్రాల సీఎంల‌కు ఏపీ సీఎం లేఖ‌..

YS Jagan

వ్యాక్సిన్ల విష‌యంలో క్ర‌మంగా రాష్ట్రాల‌ను క‌దులుతున్నాయి… కేర‌ళ‌, ప‌శ్చిమ బెంగాల్, ఒడిశా లాంటి రాష్ట్రాలు ఇప్ప‌టికే వ్యాక్సిన్‌పై కేంద్రాన్ని డిమాండ్ చేయ‌గా.. తాజాగా, ఈ పోరాటంలో చేరారు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్.. అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ‌లు రాసిన ఏపీ సీఎం.. వ్యాక్సిన్‌ల‌కు గ్లోబల్ టెండర్లు వ్యవహారాన్ని లేఖ‌ల్లో పేర్కొన్నారు.. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలందరూ సింగిల్ వాయిస్ మీద ఉండాల‌ని కోరారు వైఎస్ జ‌గ‌న్. వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదని కేరళ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.. గ్లోబల్ టెండర్లు ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని లేఖలో ప్ర‌స్తావించిన ఆయ‌న‌.. వ్యాక్సిన్ లభ్యత విషయంలో కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు అన్నట్టు పరిస్థితి మారుతోంద‌ని పేర్కొన్నారు. ఇలా వ్యాక్సిన్ల విష‌యంలో క్ర‌మంగా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతూనే ఉంది.. సుప్రీంకోర్టు సైతం.. వ్యాక్సిన్ల విష‌యంలో కేంద్రంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగతి తెలిసిందే.