NTV Telugu Site icon

FREE TABS to Students: రేపటి పౌరుల నేటి అవసరం ట్యాబ్‌లు.. అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం..

Free Tabs

Free Tabs

రేపటి పౌరుల నేటి అవసరం టెక్నాలజీ.. అందుకే ట్యాబ్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌… బాపట్ల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. యడ్లపల్లి హైస్కూల్‌లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.. 4.59 లక్షల మంది విద్యార్థులు, 59,176 ఉపాధ్యాయులకు రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేస్తుంది సర్కార్‌.. ఇక, తన పుట్టిన రోజునాడే ఈ కార్యానికి శ్రీకారం చుట్టిన సీఎం.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. నా పుట్టినరోజున నాకు ఎంతో ఇష్టమైన చిన్నారుల భవిష్యత్తు కోసం ఇంత అద్భుతమైన చేయగలుగుతున్నాను.. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు.. మన కంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని మనం కోరుకుంటాం.. కానీ, నా ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు తల్లి తండ్రులు పడుతున్న బాధలు చూశాను.. చదువుతోనే తలరాత మారుతుంది.. ఈ మూడున్నర ఏళ్ళల్లో పిల్లలు అందరూ బాగా చదవాలని దృష్టి పెట్టాం.. కీలక మార్పులు తీసుకొచ్చామని వెల్లడించారు.

Read Also: Minister Harish Rao: మావి న్యూట్రిషన్ పాలిటిక్స్.. వారివి పార్టిషన్ పాలిటిక్స్

ప్రతి ప్రభుత్వ స్కూళ్లు, ఎయిడెడ్ స్కూళ్ళల్లోని 8వ తరగతి విద్యార్థుల చేతుల్లో డిజిటల్ ట్యాబ్‌లు పెట్టగలిగాం.. తరాలు మారుతున్న కొన్ని వర్గాల తలరాతలు మారకూడదన్నది పెత్తందారీ స్వభావం.. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్య అందకూడదని పెత్తందారీ భావాలు ఆరాటపడటం చూసి బాధ వేసింది.. అందుకే ఆ పెత్తందారీ భావాలను బద్దలు కొడుతూ నిర్ణయాలు తీసుకున్నానని వెల్లడించారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఇతర దేశాల్లో తలసరి ఆదాయాన్ని, దేశీయ తలసరి ఆదాయాన్ని పోల్చి లెక్కలు చెప్పిన ముఖ్యమంత్రి.. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే దేశీయ తలసరి ఆదాయం ఎంత తక్కువగా ఉందో వివరించారు.. ఒకవైపు ముఖ్యమంత్రి ఉపన్యాసం కొనసాగుతుండగానే సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు విద్యార్థులు.. ఇక, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య వల్ల విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు సీఎం.. నేను మీ మనిషిగా, మీ బిడ్డగా, మీలో ఒకడిగా ఉన్నాను…. తోడుగా ఉంటాను అని భరోసా ఇచ్చారు. డిజిటల్ డివైడ్ వంటి పరిస్థితుల్లో మార్పు రావాలని ఆకాక్షించారు.. నా పుట్టినరోజు గురించి కాదు ఇవాళ పుడుతున్న పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు.. మేనమామగా బాధ్యత తీసుకున్నాను గనుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను అని స్పష్టం చేశారు.

ట్యాబ్‌ల పంపిణీ నా పుట్టినరోజుకు మాత్రమే పరిమితం కాదు.. ఇక నుంచి ఏటా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ జరుగుతోందని స్పష్టం చేశారు సీఎం జగన్.. ఇవి బహుళ భాషా ట్యాబ్‌లు.. తెలుగు, ఇంగ్లీష్ మాత్రమే కాకుండా ఇతర భారతీయ భాషల్లోనూ పాఠాలు ఉంటాయని తెలిపారు.. రేపటి పౌరుల నేటి అవసరం ఈ ట్యాబ్‌లుగా పేర్కొన్న ఆయన.. అందరికీ సమాన నైపుణ్యాలు ఉండకపోవచ్చు.. కానీ, ఎదగటానికి సమాన అవకాశాలు ఉండాలి అన్నారు. తరగతిలో టీచర్ చెప్పే బోధనకు ట్యాబ్‌లు మరింత ఉపయోగపడతాయన్నారు. సెక్యూర్డ్ డిజిటల్ కార్డులు ఈ ట్యాబ్ లలో ఉన్నాయి.. నెట్ వర్క్ లేకపోయినా ఆఫ్ లైన్ లో ట్యాబ్ ఉపయోగించుకోవచ్చు అన్నారు.. వీటికి మూడేళ్ల వారంటీ ఉంటుంది.. సమస్యలు వస్తే దగ్గరలోని సచివాలయంలో రిపేర్ చేయటానికి ఇవ్వొచ్చు అని సూచించారు. ఈ ట్యాబ్‌లలో సెక్యూర్డ్ డివైజ్ మొబైల్ సాఫ్ట్వేర్ పెట్టాం.. దీని వల్ల పిల్లలకు నష్టం కలిగించే అంశాలు రాకుండా చర్యలు తీసుకున్నాం.. ట్యాబ్ లు దుర్వినియోగం కాకూడదనే ఈ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. 6 నుంచి పై తరగతులు అన్నీ ఇక నుంచి డిజిటల్ క్లాసులుగా మారనున్నాయి.. ఇంటరాక్టివ్ ప్యాలెన్స్ ఏర్పాటు చేస్తున్నాం.. నాడు నేడు తొలి దశ పూర్తి అయిన 15,715 స్కూళ్లల్లో డిజిటల్ క్లాస్ రూం లు ఏర్పాటు చేస్తున్నాం.. వచ్చే జూన్ లో స్కూళ్ళు తెరిచే నాటికి డిజిటల్ క్లాస్ లు సిద్ధం అవుతాయన్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.