AP CM Jaganmohan Reddy: మన స్వాతంత్య్ర పోరాటం మహోన్నతమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా అని ఆయన పేర్కొన్నారు . పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా.. భారతీయుల గుండె అని స్పష్టం చేశారు. జాతీయ జెండా మన స్వాతంత్రానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక. సార్వభౌమత్వానికి, ఏకత్వానికి, దేశభక్తికి, మన ఆత్మగౌరవానికి ప్రతీక అంటూ వెల్లడించారు. వాదాలు వేరైనా దేశ స్వాతంత్రం గమ్యంగా ఆనాటి యోధులు పోరాడారని ఆయన గుర్తు చేశారు. వాళ్లను స్మరించుకుంటూ సెల్యూట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
AP CM Jaganmohan Reddy: త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
అహింసే ఆయుధంగా, సత్యయే సాధనంగా సాగిన శాంతియుత పోరాటం.. ప్రపంచ మానవాళికి మోహోన్నత చరిత్రగా నిలిచే ఉంటుందన్నారు. ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని, ప్రపంచంతో పోటీ పడి మరీ ప్రగతి సాధిస్తోందని కొనియాడారు సీఎం జగన్. ఆహారం, ఔషధాలు, ఆఖరికి స్మార్ట్ ఫోన్ల రంగంలోనూ దేశం టాప్ లిస్ట్‌లో కొనసాగుతోందని సీఎం జగన్ గుర్తుచేశారు. ప్రపంచంతో పోటీపడి ప్రగతిని సాధిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి అన్నారు. ఆహార ధాన్యాల లోటును దేశం అధిగమించిందన్నారు. ప్రపంచ ఫార్మారంగంలో భారత్ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. ప్రపంచానికి అవసరమైన ఔషధాలను అందిస్తున్నామని ఆయన వివరించారు. మూడేళ్ల పాలనలో అనేక పాలనా సంస్కరణలను అమలు చేశామన్నారు. అనేక వర్గాలను దోపిడీ నుంచి కాపాడామన్నారు.