NTV Telugu Site icon

AP CM Jaganmohan Reddy: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం..

Ap Cm Jagan

Ap Cm Jagan

AP CM Jaganmohan Reddy: విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. దేశంలోనే మొదటిసారిగా మైక్రోసాఫ్ట్ సంస్థ విద్యార్థులకు శిక్షణ ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి చదువుకోవాలని ఆయన అన్నారు. శుక్రవారం విశాఖపట్టణం పర్యటన సందర్భంగా సిరిపురం ఏయూ స్నాతకోత్సవ హాల్‌లో జరిగిన మైక్రోసాఫ్ట్‌ సర్టిఫికేషన్‌ ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. చదువు కుంటేనే పేదరికం నుంచి బయట పడతారని ఆయన వెల్లడించారు. బ్రిక్స్ దేశాలతో పోల్సితే మనదేశంలో 26 శాతం మంది మాత్రమే చదువుతున్నారని తెలిపారు.

మైక్రోసాఫ్ట్ ద్వారా దేశంలో తొలిసారిగా విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ ఇప్పించినట్లు ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌ ద్వారా 35, 980 మంది విద్యార్థులకు శిక్షణ పూర్తైందని తెలియజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన.. సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయని యువతకు సూచించారు. 40 రకాల కోర్సుల్లో మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ఇప్పటిదాకా 40 విభాగాల కోర్సుల్లో సుమారు 1.62 లక్షల మందికి సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. విద్యార్థులపై భారం పడకుండా.. శిక్షణ కోసం ఒక్కో విద్యార్థి మీద రూ.30 వేల ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, ఆ ఖర్చు ఇప్పటివరకు రూ. 32 కోట్లు అని చెప్పారు. రాష్ట్రంలో ప్రతీ విద్యార్థి ప్రపంచంలో పోటీ పడేలా శిక్షణ ఇప్పించినట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు.

APSRTC MD Tirumala Rao: ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు

చదువు ఉంటేనే పిల్లలు ప్రయోజకులవుతారన్న ఆయన.. విద్యారంగంలో తమ ప్రభుత్వం ఇప్పటికే అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు తెలియజేశారు. ఇంగ్లీష్ మీడియం లేకపోతే పిల్లలకు భవిష్యత్ వుండదు అని తెలుసుకుని ప్రవేశ పెట్టామన్నారు. పిల్లలు పాఠశాలకు వెళ్లే సమయంలో ఇబ్బంది పడకూడదని విద్య కానుక పెట్టామన్నారు. పేదరికం చదువుకు అడ్డు కాకూడదని అమ్మ ఒడి కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు మేలు జరగాలని విద్యా దీవెన, వసతి దీవెన ప్రవేశపెట్టామన్నారు. చదువుతున్న సమయంలోనే స్కిల్‌కు సంబంధించిన అంశాలు గుర్తించి వారికి శిక్షణ ఇస్తున్నామన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ద్వారా మంచి ఉద్యోగాలు వస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు.

Show comments