Site icon NTV Telugu

CM Jagan: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాసైన వారికీ బెటర్‌మెంట్

Cm Jagan

Cm Jagan

విద్యాశాఖపై తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా పదో తరగతి ఫలితాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం తక్కువ రావడాన్ని తప్పుగా భావించాల్సిన అవసరం లేదన్నారు. నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయిన వారికి నెలలోజుల్లోనే మళ్ళీ పరీక్షలు పెట్టి వారిని కూడా రెగ్యులర్‌గానే పరిగణిస్తామని పేర్కొన్నారు. పదో తరగతిలో పాసైన వారికి కూడా ఏదైనా రెండు సబ్జెక్టులలో బెటర్‌మెంట్‌ రాసుకోవడానికి అనుమతి ఇస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెప్పారని సీఎం జగన్ అన్నారు. 49 అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వారు రూ.500 ఫీజు కట్టి ఏదైనా రెండు సబ్జెక్టుల్లో బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసుకునే సౌలభ్యం కల్పించారన్నారు.

మరోవైపు ఈ నెలాఖరు నాటికి రెండో దశ నాడు-నేడు కింద అన్ని స్కూల్స్‌లో పనులు మొదలు కావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతి పాఠశాలలో టీవీలు ఉండాలన్నారు. బోధన, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మనం పోటీపడుతున్నామని జగన్ పేర్కొన్నారు. స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి విద్యా కానుక అందించాలని సూచించారు. బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్‌ కాలేజీ లేదా హైస్కూల్‌ ప్లస్‌ లేదా కేజీబీవీ ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షా సమావేశంలో రీడ్‌ ఎలాంగ్‌ యాప్‌ పనితీరును సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. ఇప్పటి వరకు సుమారు 57,828 మంది రోజూ రీడ్ ఎలాంగ్ యాప్‌ను వినియోగిస్తున్నారని అధికారులు తెలిపారు. ఫొనిటిక్స్‌ మీద ప్రధానంగా దృష్టి పెట్టాలని.. పిల్లలు పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడగలగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.

Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త

Exit mobile version