Chandrababu regular bail: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ అధికారులు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ నెల 29 నుంచి రాజకీయ పార్టీ మీటింగ్స్, ర్యాలీల్లో పాల్గొనవచ్చు అని కూడా కోర్టు తెలిపింది. కాగా, ఆరోగ్య కారణాలతో ఇదే కేసులో గత నెల (అక్టోబర్) 31వ తారీఖున చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 28వ తేదీతో మధ్యంతర బెయిల్ గడువు ముగియబోతుంది. అయితే ఇదే సమయంలో నిన్న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ దొరికింది.
Read Also: Air India: విమానంలో సాంకేతిక లోపం.. టేకాఫ్ అయిన కాసేపటికే..
దీంతో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీ హైకోర్టు ముందు సాక్ష్యాలను ప్రవేశ పెట్టినట్టుగా ఏపీ సీఐడీ తరపు న్యాయవాది ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. కానీ, ఏపీ హైకోర్టు తమ సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోకుండానే తీర్పు ఇచ్చిందన్నారు. బాబు బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా కోర్టు పట్టించుకోలేదని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాము సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినట్లు చెప్పారు. ఇక, చంద్రబాబు బెయిల్ పై స్పెషల్ లీవ్ పిటిషన్ వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉంది అని ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. షరతులు లేకుండా చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడాన్ని, ప్రధాన కేసుపై (మెరిట్స్) చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపి ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది.