Vijayasai Reddy: విజయ సాయిరెడ్డికి మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు

  • విజయ సాయిరెడ్డికి మంగళగిరి సీఐడీ పోలీసుల నోటీసులు..
  • ఎల్లుండి ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు..
  • విజయ సాయిరెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ..
Cid

Cid

Vijayasai Reddy: మాజీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డికి మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎల్లుండి (మార్చ్ 12వ తేదీన) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు. నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120 (b), రెడ్ విత్ 34 బీఎన్ఎస్ సెక్షన్లు ప్రస్తావించారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విజయ సాయిరెడ్డిపై కేసు నమోదు అయింది. అయితే, కాకినాడ పోర్టు వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారని సాయిరెడ్డిపై కేవీ రావు ఫిర్యాదు చేశారు.

Read Also: Off The Record : నిలకడలేని రాజకీయం ఆ ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీని పక్కన పడేసిందా..?

అయితే, పోర్టు వాటాల అక్రమ బదిలీపై సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డితో పాటు విజయ సాయిరెడ్డిపై మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, సాయిరెడ్డి ఎల్లుండి సీఐడీ అధికారుల విచారణకు హాజరవుతారా లేదా అనే అంశం ప్రస్తుతం తెగ ఉత్కంఠ రేపుతుంది. కాగా, ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విజయ సాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.