Site icon NTV Telugu

AP CID: ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు.. చంద్రబాబును ఏ1గా చేర్చిన సీఐడీ

Rk

Rk

అమరావతి రాజధాని వ్యవహారం తెలుగుదేశం పార్టీ నేతలను వెంటాడుతూనే ఉంది.. తాజాగా, అమరావతి రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.. ఇక, మంగళగిరి ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు.. ఈ కేసులో ఏ1గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ, ఏ3గా లింగమనేని రమేష్‌, ఏ4గా లింగమనేని రాజశేఖర్, ఏ5గా అంజనీకుమార్‌, ఏ6గా హెరిటేజ్‌ ఫుడ్స్‌‌ను చేర్చింది సీఐడీ.. వారిపై 120బీ, 420, 34, 35, 36, 37, 166 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. అలైన్ మెంట్ మార్పుతో రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ పామ్స్, జయని ఎస్టేట్స్ కు లబ్ధి కల్గించారని ఆరోపించారు.. కాగా, 454 కిలోమీటర్ల పాటు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించాలని తలపెట్టారు…. కేంద్రం అనుమతితో అన్ని ప్రాంతాలను కలిపేలా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు.. ఇప్పుడు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుల్లో చిక్కుకుంటుంది.. అలైన్‌మెంట్‌, భూసేకరణ.. లాంటి అంశాలకు వివాదానికి కారణంగా మారిపోయాయి.

Read Also: Massoda Movie Review: మసూద

మరోవైపు, మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్‌లో విచారిస్తున్నారు ఏపీ సీఐడీ పోలీసులు.. హైకోర్టు ఆదేశాలతో ఉదయం 11.30 నుండి విచారణసాగుతోంది.. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవతవకలపై ఆయన్ని ప్రశ్నిస్తున్నారు.. 160 సీఆర్పీసీ కింద ఇప్పటికే నోటీసు ఇచ్చింది సీఐడీ.. కాగా, నారాయణ అనారోగ్యంతో బాధపడుతూ, ఇటీవల శస్త్రచికిత్స పూర్తవడంతో సీఐడీ విచారణకు హాజరు కాలేరంటూ హైకోర్టుకి తెలిపారు నారాయణ తరుపు న్యాయవాదులు.. ఇక, హైకోర్టు నారాయణను ఇంట్లో విచారించవచ్చు అని చెప్పడంతో ఇవాళ ఉదయం 11 గంటలు నుండి మధ్యాహ్నం 1 గంట వరకు.. తిరిగి మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు విచారిస్తోంది సీఐడీ బృందం.. హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నారాయణ నివాసం ఉంటుంటున్నారు.. అక్కడికే వెళ్లి ప్రశ్నిస్తున్నారు సీఐడీ పోలీసులు.

Exit mobile version