Site icon NTV Telugu

Details of CM Jagan Visit to Kadapa: కడప జిల్లాలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే..

Jagan

Jagan

Details of CM Jagan Visit to Kadapa: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గ సమావేశం మరోసారి వాయిదా పడింది. సెప్టెంబర్‌ 1న జరగాల్సిన ఏపీ కేబినెట్‌ భేటీని, 7కు వాయిదా పడింది. రేపు (31)న వినాయక చవితితో పాటు సెప్టెంబర్‌ 1నుంచి 3 వరకు సీఎం జగన్‌ కడప పర్యటనలో ఉండటంతో మంత్రి వర్గ సమావేశాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సెప్టెంబర్‌ 7న కేబినెట్‌ భేటీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

కాగా.. నిన్న 29న సమావేశం జరగాల్సిన ఉండగా, సెప్టెంబర్‌ 1కు వాయిదా వేయడం జరిగింది, అయితే మళ్లీ ఇప్పుడు 7కు మారింది.. అంటే రెండోసారి వాయిదా పడింది. సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు.. మూడురోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు.. ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈనేపథ్యంలో.. దివంగత సీఎం వైఎస్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు.. ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎల్లుండి (సెప్టెంబరు1న) మధ్యాహ్నం 2గంటలకు సీఎం జగన్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడి నుంచి ఇడుపులపాయ వెళ్లి, అక్కడ వైఎస్సార్‌ ఎస్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో రాత్రి బస చేయనున్నారు.

ఎల్లుండి (సెప్టెంబర్‌ 2న) ఉదయం 8.50గంటలకు సీఎం జగన్‌ ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడినుంచి వెళ్లి ఎస్టేట్‌లోని ప్రేయర్‌ హాల్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై ఆరోజు సాయంత్రం సమీక్షలు నిర్వహించనున్నారు. ఆతరువాత రాత్రికి అక్కడే బస చేసి, సెప్టెంబర్‌ 3న ఉదయం కడప నుంచి బయల్దేరి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్నారు.
Chhattisgarh: రామ్‌దాహ జలపాతంలో మునిగి ఆరుగురు పర్యాటకులు మృతి

Exit mobile version