ఏపిలో తొలిసారిగా జెండర్ బడ్జెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 9 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈరోజు జరగబోతున్నాయి. ఒక్కరోజు మాత్రమే ఈ సమావేశం ఉంటుంది. అయితే.. రూ. 2.25 -రూ. 2.30 లక్షల కోట్ల మధ్యలో 2021-22 వార్షిక బడ్జెట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాల అమలుకు పెద్ద పీట వేయనుంది ఏపీ సర్కార్. సామాజిక పెన్షన్‌ను రూ. 2500కు పెంచనున్న ప్రభుత్వం… పెంచిన సామాజిక పెన్షన్‌ను జనవరి నుంచి అమలు చేయనుంది. 45-60 ఏళ్ల లోపు మహిళలకు ఈబీసీ నేస్తం కోసం కేటాయింపులు చేస్తుండగా… ఈ ఏడాది బడ్జెట్ పై అప్పుల ప్రభావం కన్పించటం లేదు. గత ప్రభుత్వ అప్పులకు వడ్డీలు, పాత బిల్లుల చెల్లింపులకు ప్రత్యేక కేటాయింపులు చేస్తోంది ఏపీ సర్కార్. అప్పులు చేసైనా సంక్షేమ పథకాలు అమలు చేసేలా బడ్జెట్ రూపకల్పన చేయనుంది సర్కార్. ఏపీలో తొలిసారిగా జెండర్ బడ్జెట్ పెట్టనుంది సర్కార్. మహిళలు.. పిల్లలకు ఎంత ఖర్చు పెట్టనున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనుంది ఏపీ ప్రభుత్వం. అసెంబ్లీలో మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా, మండలిలో మంత్రి సుచరిత ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- Tags
- ap
- ap budget 2021-22
- cm jagan
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..