Site icon NTV Telugu

Parthasarathy: ఏపీ హక్కుల కోసం కేసీఆర్‌ కృషి..! ఆయన ఆంధ్ర పాలకులు, దోపిడీనే ప్రశ్నించారు..

Parthasarathy

Parthasarathy

Parthasarathy: కేసీఆర్‌ జాతీయ పార్టీ నేతగా ఆంధ్రప్రదేశ్‌ హక్కుల కోసం కృషి చేస్తారని తెలిపారు బీఆర్ఎస్‌ నేత పార్థసారథి.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌ ఎప్పుడైనా ఆంధ్ర పాలకులు, పెట్టుబడిదారుల దోపిడీనే ప్రశ్నించారు.. కానీ, ప్రజలను ఆయన ఎప్పుడూ దూషించలేదని స్పష్టం చేశారు.. ఇక, కేసీఆర్ సీఎం అయ్యాక.. తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేశారని తెలిపారు. విభజన హామీలు అమలు‌ చేయకుండా బీజేపీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందని విమర్శించారు.. కేసీఆర్‌ జాతీయ పార్టీ నేతగా ఏపీ హక్కుల కోసం పోరాటం చేస్తారని తెలిపారు.. ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ఎస్‌ బహిరంగ సభ దేశ రాజకీయాల్లో మార్పునకు సంకేతం అవుతుందని ప్రకటించారు.. బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్ధిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందన్న ఆయన.. తెలంగాణలో‌ జరిగిన అభివృద్ధి ఫలాలను దేశం మొత్తం అమలు చేయాలని కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారని చెప్పుకొచ్చారు.

Read Also: Passenger Train: విశాఖలో పట్టాలు తప్పిన ప్యాసింజర్‌ రైలు..

రైతే రాజు అనే నినాదంతో మేం ప్రజల్లోకి వెళ్తాం.. దళిత బంధు పథకాన్ని దేశం అంతా అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారని తెలిపారు పార్థసారథి.. తెలంగాణలో‌ జరుగుతున్న అభివృద్ధిని ఏపీ ప్రజలు కూడా కోరుకుంటున్నారని.. చంద్రబాబు, వైఎస్‌ జగన్ రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.. ఇ, వైఎస్‌ జగన్-చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ అంటే భయం.. అందుకే ప్రశ్నించడం మానేశారు విమర్శించారు. కేసీఆర్ సారథ్యంలో ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఉంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ఫ్లాంటును ప్రైవేటు పరం చేస్తే అడగలేక పోయారు అని ఏపీ నేతలపై మండిపడ్డారు.. కానీ, కేసీఆర్, కేటీఆర్.. విశాఖ‌ కార్మికులకు అండగా నిలిచారన్నారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాల‌పై జగన్, చంద్రబాబు పోరాటం చేయలేని పరిస్థితి ఉందని ఆరోపించారు.. మన పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఉంది.. ఏపీలోనే వారికి అవకాశాలు కల్పించే సత్తా మాత్రం కేసీఆర్‌కే ఉందన్నారు.

Exit mobile version