NTV Telugu Site icon

AP BJP: ముగిసిన ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం.. క్లాస్ పీకిన ప్రధాన కార్యదర్శి

Ap Bjp

Ap Bjp

AP BJP State Executive Meeting Details: ఏపీ బీజేపీ నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా ఏపీ బీజేపీ ప్రఘాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహరించారు. ఈ కమిటీలో భాగంగా.. తొమ్మిదేళ్ల మోడీ పాలనపై ప్రచారం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. పొత్తులపై మాత్రం ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ఆ ప్రస్తావన లేకుండానే ఈ సమావేశం ముగిసింది. అయితే.. ఈ కార్యవర్గంలో జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ పార్టీ నేతలకు క్లాస్ పీకారు. ఏపీలో బీజేపీ బలపడడానికి అవకాశం ఉన్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో బలపడలేదని మండిపడ్డారు. ప్రతి అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఐదారుగురు పోటీ పడే పరిస్థితి ఉండాలన్నారు. నేతలు, కార్యకర్తలు క్రమశిక్షణ మెలగాలని.. ఎంతవరకు మాట్లాడాలో అంత వరకే మాట్లాడాలని సూచించారు.

MP Uttam Kumar Reddy : ఈసారి 50వేల ఓట్లకు ఒక్కటి తక్కువచ్చినా.. రాజకీయాలకు గుడ్ బై చెప్తా..

పార్టీ విషయాలపై ఏమైనా మాట్లాడాలంటే.. పార్టీ పెద్దలకు నేరుగా చెప్పాలని శివ ప్రకాష్ పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మరింత బలం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటకలో ఓడిపోయినంత మాత్రాన అక్కడ బలం తగ్గినట్టు కాదని.. గత ఎన్నికల్లో ఎంత ఓట్ల శాతం వచ్చాయో, ఇప్పుడు కూడా అంతే శాతం ఓట్లు వచ్చాయని అన్నారు. జేడీఎస్ ఓట్ల శాతం భారీగా తగ్గడం వల్లే కర్ణాటకలో ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేలా పని చేయాలని.. ప్రతి నియోజకవర్గంలో ఫుల్‌టైం విస్తారక్‌లుగా పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఫుల్ టైం విస్తారక్‌లకు మరింత ట్రైనింగ్ ఇవ్వాలని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనే 26 జిల్లాల ఇన్‌చార్జీలను మార్చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు 26 జిల్లాల కొత్త ఇన్‌చార్జీలను ప్రకటించారు.

2000 Notes Withdraw : ఆ సెక్షన్ ఉపయోగించి రూ. 2000 నోట్లు రద్దు చేసిన ఆర్బీఐ