NTV Telugu Site icon

AP Bar Licenses: బార్ లైసెన్సులు మరో రెండునెలలు పొడిగింపు

Wines

Wines

ఏపీలో బార్ ఓనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో బార్ లైసెన్సులను మరో రెండు నెలల పాటు పొడిగించింది ప్రభుత్వం. జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31 తేదీ వరకూ లైసెన్సుల గడువు పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నెలాఖరుతో ప్రస్తుత బార్ లైసెన్సుల గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

లైసెన్సుల పొడిగించిన కాలానికి నిర్దేశిత ఫీజులు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చిది ప్రభుత్వం. జూన్ 27 తేదీలో నిర్దేశిత లైసెన్సు ఫీజులు చెల్లించాల్సిందిగా సూచనలు చేసింది. ఏపీలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి కొత్త బార్ పాలసీ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సెప్టెంబరు 1 తేదీ నుంచి కొత్తబార్ పాలసీ అమల్లోకి వస్తుందని పేర్కొంది ప్రభుత్వం.

ఏపీలో మద్య నిషేధం వుండదని బార్ల లైసెన్స్ ల పునరుద్ధరణతో తేలిపోయింది. 840 బార్‌లకు మించకుండా లైసెన్స్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 50 వేలలోపు జనాభా గల ప్రాంతంలో రూ.5 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో రూ.7.50 లక్షలు, 5 లక్షలకుపైగా జనాభా ప్రాంతాల్లో రూ.10 లక్షలు అప్లికేషన్‌ ఫీజు కేటాయించింది. ఏపీలో వేలం పద్ధతిలో షాపులను కేటాయిస్తారు. త్రీస్టార్ హోటల్‌లో లైసెన్స్‌ ఫీజు రూ.5 లక్షలు, ఏడాదికి నాన్‌ రిఫండబుల్‌ రిజిస్ట్రేషన్‌ చార్జీ రూ.50 లక్షలుగా నిర్ణయించారు.

India vs South Africa : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకు సఫారీలు