Site icon NTV Telugu

10th Exam Shedule : విద్యార్థులకు అలర్ట్‌.. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల.

Ap 10th Exam

Ap 10th Exam

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు కీలక సమాచారం. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ 2026 మార్చిలో నిర్వహించనున్న ఎస్ఎస్‌సీ (SSC), ఓఎస్ఎస్‌సీ (OSSC) , వొకేషనల్ పబ్లిక్ పరీక్షల సమగ్ర షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలు 2026 మార్చి 16వ తేదీన ప్రారంభమై, ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ముందస్తుగానే ఈ టైమ్ టేబుల్‌ను ప్రకటించింది.

పరీక్షలన్నీ ఉదయం 09:30 గంటలకు ప్రారంభమవుతాయి. మెజారిటీ ప్రధాన పరీక్షలు మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్‌తో పరీక్షలు మొదలవుతాయి. ఆ తర్వాత మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 20న ఇంగ్లీష్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు అత్యంత కీలకమైన గణిత పరీక్ష మార్చి 23న జరగనుంది. సైన్స్ విభాగంలో ఫిజికల్ సైన్స్ పరీక్షను మార్చి 25న, బయోలాజికల్ సైన్స్ పరీక్షను మార్చి 28న నిర్వహించేలా బోర్డు ఏర్పాట్లు చేసింది. సోషల్ స్టడీస్ పరీక్ష మార్చి 30న జరుగుతుంది.

RRB Group D: రైల్వేలో 22,000 గ్రూప్ డి పోస్టులు.. కొత్త అప్లికేషన్ డేట్ ఇదే

ప్రధాన సబ్జెక్టుల అనంతరం, మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-II , ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 1వ తేదీన ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-IIతో పాటు ఎస్ఎస్‌సీ వొకేషనల్ కోర్సు థియరీ పరీక్షలతో ఈ పబ్లిక్ పరీక్షల పర్వం ముగుస్తుంది. సైన్స్ పరీక్షలు, వొకేషనల్ కోర్సుల వంటి కొన్ని నిర్దిష్ట పేపర్లకు మాత్రం ముగింపు సమయం మధ్యాహ్నం 11:15 లేదా 11:30 గంటల వరకు మాత్రమే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

పరీక్షల నిర్వహణపై విద్యా బోర్డు కొన్ని కీలక సూచనలు చేసింది. అకడమిక్ కోర్సులకు సంబంధించిన సబ్జెక్టులు ఎస్ఎస్‌సీ , ఓఎస్ఎస్‌సీ విద్యార్థులకు ఉమ్మడిగా ఉంటాయని పేర్కొంది. ఈ పరీక్షల షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవుల జాబితా-2026కు లోబడి ఉంటుంది. పరీక్షా సమయంలో విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, తమకు కేటాయించిన సరైన ప్రశ్నపత్రాన్నే అడిగి తీసుకోవాలని బోర్డు హెచ్చరించింది.

పొరపాటున తప్పుడు ప్రశ్నపత్రానికి సమాధానాలు రాస్తే, వారి ఫలితాలను రద్దు చేసే అవకాశం ఉంటుందని, ఆ బాధ్యత విద్యార్థులదేనని అధికారులు తేల్చి చెప్పారు. ఈ షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అధికారికంగా ధ్రువీకరించారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాయాలని సూచించారు.

PM Modi: ప్రధాని, సీఎంగా కాకుండా.. అలా ఉండటానికి గొప్ప గర్వంగా ఉంటుంది

Exit mobile version