NTV Telugu Site icon

10TH Exams : రేపటి నుంచి ఏప్రిల్ 1 వరకు టెన్త్ ఎగ్జామ్స్..

10TH EXAMS

10TH EXAMS

10TH Exams : ఏపీలో పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 దాకా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు అధికారులు. వీటి కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. పరీక్షలు ఉదయం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి. ఈ ఎగ్జామ్స్ కు చివరి నిముషం దాకా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. టెన్త్ స్టూడెంట్లకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల 450 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు. 6లక్షల 19వేల 275 మంది స్టూడెంట్లు ఎగ్జామ్ రాయబోతున్నారు.

Read Also : Virat Kohli : బీసీసీఐ నిర్ణంపై కోహ్లీ అసంతృప్తి.. మద్దతుగా నిలుస్తున్న క్రికెటర్స్..

ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద 100 మీటర్ల దాకా 144వ సెక్షన్ విధించారు. ఎగ్జామ్స్ సెంటర్లకు దగ్గర్లో జిరాక్స్ సెంటర్లు, నెట్ సెంటర్లు మూసేయడంతో పాటు ఫేక్ న్యూస్ ఎవరైనా స్ప్రెడ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. రాష్ట్ర స్థాయిలో 08662974540 కంట్రోల్ రూమ్ నంబరు ను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు సీఎం చంద్రబాబు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎగ్జామ్స్ బాగా రాయాలంటూ కోరారు.