Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. వైసీపీకి గుడ్‌బై చెప్పిన పార్టీ నేతలు, కార్యకర్తలు.. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు.. సంబేపల్లి, లక్కిరెడ్డిపల్లి మండలాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి బైబై చెప్పేసి.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురిగింజకుంట, దప్పేపల్లి గ్రామాలకు చెందిన వైసీపీ సర్పంచ్ లు రఘునాథ రెడ్డి, కేశవప్ప ఆధ్వర్యంలో 180 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.. వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి… అయితే, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే చాలా మంది టీడీపీ వైపు చూస్తున్నారని.. ఈ నేపథ్యంలో.. సంబేపల్లి, లక్కిరెడ్డిపల్లి మండలాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు.. ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరుతున్నారని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..
Read Also: Minister Narayana: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారాయణ
