AP News: నీటి కుంటలో మునిగి నలుగురు మృతి చెందిన విషాద ఘటన అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. మొలకలచెరువు మండల కేంద్రానికి చెందిన మల్లేష్ (36), అతని కుమార్తె లావణ్య (12), కుమారుడు నందకిషోర్ (10) కలిసి గ్రామ సమీపంలోని పెద్ద చెరువుకు బట్టలు ఉతికేందుకు వెళ్లారు.. ఈ క్రమంలో ఈత కొట్టేందుకు వెళ్లి చెరువులోకి దిగిన నందకిషోర్, అతని స్నేహితురాలు నందిని నీటిలో మునిగిపోతుండగా.. అది చూసిన లావణ్య పెద్దగా కేకలు వేసింది. అంతేకాదు.. తమ్ముడుని రక్షించేందుకు ఆమె కూడా ప్రయత్నిస్తూ నీటిలోకి దిగింది. వీరి కేకలు విన్న తండ్రి మల్లేష్ కూడా నీటిలో దిగి నీటిలో మునిగిపోతున్న ముగ్గురు పిల్లలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, నీటి కుంటలో పాచి ఉండడంతో నలుగురు అందులో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్లను రప్పించారు.. ఇక, రంగంలోకి దిగిన గజ ఈతగాళ్లు నలుగురు మృతదేహాలను బయటకు తీశారు. ములకలచెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడం, పక్కింటి విద్యార్థి కూడా మృతి చెందడంతో ములకలచెరువు గ్రామంలో విషాదం నెలకొంది..
Read Also: AP DGP Serious Warning: పహల్గామ్ ఉగ్రదాడి.. వారికి ఏపీ డీజీపీ సీరియస్ వార్నింగ్
