Site icon NTV Telugu

Threatening calls: మహిళా తహసీల్దార్‌కు బెదిరింపు కాల్స్‌.. మేం వస్తున్నాం.. బయటకు రండి..!

Threatening Calls

Threatening Calls

Threatening calls: అన్నమయ్య జిల్లా వీరబల్లి మండల తహసీల్దారు శ్రావణికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్‌ రావడం కలకలం రేగింది. కార్యాలయంలో మంగళవారం విధులు నిర్వర్తిస్తుండగా ఆమె మొబైల్ ఫోన్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి ఎక్కడున్నారు.? ఏమి చేస్తున్నారు..? విధుల్లో ఉన్నారా..? మేము కార్యాలయం వద్దకు వస్తున్నాం.. బయటకు రండి అంటూ బెదిరించేలా మాట్లాడారు గుర్తుతెలియని వ్యక్తులు.. దీంతో ఆందోళనకు గురైన ఆమె.. ఈ విషయాన్ని కలెక్టర్ చామకూరి శ్రీధర్ కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకు ఫోన్ చేసి తహసిల్దార్ కు వచ్చిన బెదిరింపు కాల్స్ పై విచారణ చేపట్టాలని కోరారు. ఎస్పీ ఆదేశాలతో రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్ ఆన్ లైన్ లో నంబర్‌ను పరిశీలించగా బెంగుళూరు నుంచి కాల్ వచ్చినట్లు గుర్తించారు. ఫేక్ కాల్ గా భావిస్తున్నామని, ఆ ఫోన్ నెంబర్ పై ఆరా తీస్తున్నామని సీఐ వరప్రసాద్ తెలిపారు. అయితే, ఈ బెదిరింపు కాల్స్‌ వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు..

Read Also: DaakuMaharaaj : డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ పూర్తి..

Exit mobile version