Site icon NTV Telugu

AP Crime: ఆస్తి కోసం తల్లిదండ్రుల హత్య..! తాగునీటిలో విషం కలిపి..

Crime

Crime

AP Crime: ఆస్తి ముందు.. కన్న తల్లిదండ్రులు, కట్టుకున్నవారు.. తోబుట్టులు.. ఇలా ఎవరూ కనబడడం లేదు.. ఆస్తి ఉంటేచాలన్న దురాశతో.. అయినవారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు.. ప్రాణాలు తీస్తున్నారు కూడా.. ఇప్పటికే ఎంతో మంది ఆస్తుల విషయం ప్రాణాలు పోగొట్టుకున్నారు.. తాజాగా, అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం కొత్త వడ్డేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆస్తిని కాజేసేందుకు కన్న కొడుకు ఉప్పుతోళ్ల వెంకటరమణ అనే వ్యక్తి తన భార్య కళావతితో కలిసి తల్లి తండ్రికి తాగునీటిలో విషద్రావం కలిపి తాగించారు.. విషయం కలిపిన నీటిని తాగిన ఉప్పుతోళ్ల చిన్న సుబ్బన్న (80), ఉప్పుతోళ్ల నాగమ్మ (75) లు అపస్మార్క స్థితిలో పడిపోయారు.. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో చిన్న సుబ్బన్న మృతి కిందగా, నాగమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.. ఆస్తి కోసమే కొడుకు రమణ, కోడలు కళావతి కలిసి విషయం ఇచ్చి చంపివేశారంటూ మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రి చేరుకొని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసి జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు.

Read Also: Karnataka: సిద్దరామయ్య దిగిపోయి డీకే శివకుమార్‌కి సీఎం పదవి ఇవ్వాలి..

Exit mobile version