Site icon NTV Telugu

Sugavasi Balasubramanyam Resign for TDP: రాజంపేటలో టీడీపీకి బిగ్‌ షాక్‌..!

Sugavasi Balasubramanyam

Sugavasi Balasubramanyam

Sugavasi Balasubramanyam Resign for TDP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వరుసగా.. టీడీపీ, జనసేన, బీజేపీలోకి వలసలు వచ్చారు నేతలు.. ఎంపీ, ఎమ్మెల్సీలు, కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు సైతం.. వైసీపీకి గుడ్‌బై చెప్పి.. కూటమి పార్టీలో చేరారు.. అయితే, ఇప్పుడు.. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. గత ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన సుగవాసి బాలసుబ్రమణ్యం.. ఇప్పుడు, టీడీపీకి గుడ్‌బై చెప్పారు.. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పంపారు సుగవాసి బాలసుబ్రమణ్యం.. “ప్రజల సలహాలను, సూచనలను, అభిప్రాయాలను, మనోభావాలను గౌరవిస్తూ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను…” అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖలో పేర్కొన్నారు సుగవాసి బాలసుబ్రమణ్యం..

Read Also: Chhattisgarh: బీజాపూర్ నేషనల్ పార్క్‌లో మరో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి

మరోవైపు, అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రాజంపేట పద్మ ప్రియ కళ్యాణ మండపం లో నియోజక వర్గ టీడీపీ బత్యాల చెంగల రాయుడు వర్గీయుల భేటీ అయ్యారు. టీడీపీ అసెంబ్లీ ఇంఛార్జ్‌ పదవి చెంగల రాయుడుకు ఇవ్వాలని.. మోకాళ్ళపై నిలబడి కార్యకర్తలు నినాదాలు చేసారు. రాజంపేట తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ కోవర్డులు చొరపడ్డారని.. నిజమైన కార్యకర్తలకు పార్టీ నేతలు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, సుగవాసి బాలసుబ్రమణ్యం.. టీడీపీకి గుడ్‌బై చెప్పడం ఆసక్తికరంగా మారింది..

Exit mobile version