NTV Telugu Site icon

Annamaya District: గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కౌంటర్..

Minister Ramprasad Reddy

Minister Ramprasad Reddy

వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన పై ఆరోపణలు చేయడం తగదని అన్నారు. సాఫ్ట్‌వేర్‌ను, ఐటీని తాను కనిపెట్టినట్లు చంద్రబాబు మాట్లాడలేదు.. చంద్రబాబు చెప్పింది ఒకటే హైదరాబాదులో ఆ రోజు ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చేదానికి నేను బిల్ గేట్స్‌ను ఒప్పించి ఐటీ మిలీనియం బ్లాక్ పెట్టించింది నేనే అని చెప్పారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత వందలాది కంపెనీలు ఒక్కదానికొకటి హైదరాబాదుకు రావడం జరిగిందన్నారు. తాను ఐటీని సృష్టించాను.. తయారు చేశాను అని ఎక్కడా కూడా చంద్రబాబు చెప్పలేదని మంత్రి పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై కామెంట్ చేసేటప్పుడు తెలుసుకొని కామెంట్స్ చేయాలని సూచించారు.

Ramayana: పార్లమెంటులో ‘రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ప్రత్యేక ప్రదర్శన

రాయచోటికి సీఎం వరాలు కురిపించలేదని శ్రీకాంత్ రెడ్డి అనడం విడ్డూరం అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. నువ్వు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి రాయచోటికి ఏమి వరాలు ఇచ్చావు? అని ప్రశ్నించారు. మీ నాయకుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు.. మీరు రాయచోటి ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని అన్నారు. ఈరోజు చాలెంజ్ చేసి చెప్తున్నా.. ప్రభుత్వం ఏర్పడిన 8 నెలలలోనే ఎప్పుడూ లేని విధంగా రాయచోటి నియోజకవర్గంలో 45 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాం.. తాగునీటి సమస్య తీర్చేందుకు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసి బోర్లు వేసి నీటి సమస్యను తీర్చామని తెలిపారు. రాయచోటి ప్రాంతంలో 6.3 కోట్ల రూపాయలతో గుంతలు ఏర్పడిన రహదారులను బాగు చేశాం.. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మరమ్మతుల కోసం 3.5 కోట్ల రూపాయలు ఇచ్చాం.. 6 మండలాలలో తాగునీటి సమస్య తీర్చేందుకు కేంద్ర పథకం అమృత్ ధార, జల్ జీవన్ మిషన్ కింద 280 కోట్ల రూపాయలు కేటాయించి టెండర్లకు పిలిచామని తెలిపారు.

Sanju Samson: సంజు శాంసన్ ఫామ్‌లోకి వస్తే అతడిని ఆపడం ఎవరి తరం కాదు..

శ్రీనివాసపురం రిజర్వాయర్ గురించి మాట్లాడే హక్కు శ్రీకాంత్ రెడ్డికి లేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి దుయ్యబట్టారు. మీ హయాంలో శ్రీనివాసపురం రిజర్వాయర్ కింద ఉన్న భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా వచ్చే 6 కోట్ల రూపాయలు ఇప్పించే గతి నీకు లేదా? అని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి లాగా లక్షల మంది జనాలు వచ్చేలా మీటింగు పెట్టలేదు.. ప్రజాధనాన్ని వృధా చేయలేదన్నారు. ఒక ఎస్సీ, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాల ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇచ్చారని చెప్పారు. నువ్వు అవమానపరిచి మాట్లాడింది మమ్మల్ని, మా ప్రభుత్వాన్ని కాదు.. రాష్ట్రంలోని 64 లక్షల మంది పెన్షన్ తీసుకునే పేదవారిని నువ్వు అవమానించినట్లేనని దుయ్యబట్టారు.